ఆటాపోటీ

ఈత కొడుతూ..మ్యాచ్ చూస్తూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉక్కపోతతో సతమతమవుతున్నప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడాన్ని మించిన సుఖం మరొకటి ఉండదు. రెండు మేటి క్రికెట్ జట్లు ఢీ కొంటున్న మ్యాచ్‌ని తిలకించేందుకు టికెట్ దొరకడమే మహద్భాగ్యంగా భావిస్తారు అభిమానులు. స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ.. క్రికెట్ మ్యాచ్‌ని చూసే అవకాశం ఉంటుందని ఇప్పటి వరకూ ఎవరూ ఊహించలేదు. కానీ, ఆ అద్భుత అవకాశాన్ని కల్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులు నిర్ణయించారు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 15న గబ్బా స్టేడియంలో మొదలయ్యే టెస్టు మ్యాచ్‌ని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ చూసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్టాండ్స్‌లో ఒకవైపు చిన్ని స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించి, దాని పక్కనే అంబ్రెల్లా టెంట్లు వేస్తారు. అక్కడ డిసెంబర్ మాసంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 35 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఎంపిక చేసిన కొంత మందికి స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతూ మ్యాచ్‌ని చూసే అవకాశాన్ని సిఎ కల్పిస్తున్నది. ప్రత్యేక ధరకు టికెట్ కొన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉంటే, డ్రా ద్వారా ఎంపిక చేసిన వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తారు. మొత్తం మీద క్రికెట్ చరిత్రలోనే స్విమ్మింగ్ పూల్‌లో రిలాక్స్ అవుతూ టెస్టును చూసే అవకాశం అభిమానులకు లభించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో!