ఆటాపోటీ

‘హాల్’ ఆఫ్ ఫేమ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్లీ హాల్ చాలా దూరం నుంచి రనప్ మొదలుపెట్టేవాడు. బౌండరీ లైన్ నుంచి పరిగెడతాడంటూ అతనిని ఆటపట్టించిన వారు లేకపోలేదు. 1960లో ‘టై’గా ముగిసిన మ్యాచ్‌లో చివరి ఓవర్ బౌల్ చేసి, టెస్టు క్రికెట్‌లో చిరస్మరణీయుడయ్యాడు. బ్రిస్బేన్‌లో జరిగిన ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్ 453 పరుగులు సాధిస్తే, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 505 పరుగులు చేసింది. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేసి, ఆసీస్ ముందు 233 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సులభంగా కనిపించిన ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయిన ఆసీస్ 232 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ‘టై’ అయింది. కీలకమైన చివరి ఓవర్‌ను హాల్ వేశాడు. అతను తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు చొప్పున వికెట్లు పడగొట్టాడు. అప్పట్లో ఓవర్‌కు ఎనిమిది బంతులు ఉండేవి.

చిత్రం.. వెస్లీ హాల్