ఆటాపోటీ

ఒకప్పటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు వెస్టిండీస్‌కు ఇప్పుడు లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించే ఒకప్పటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు వెస్టిండీస్‌కు ఇప్పుడు లేరు. ఎలాంటి బౌలింగ్‌నైనా చితకబాది పరుగులు కొల్లగొట్టే నాటి మేటి హిట్టర్లు కనిపించడం లేదు. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన విండీస్ పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాజయాలే విండీస్ దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయ. చార్లెస్ గ్రిఫిత్, ఆండీ రాబర్ట్స్, మైఖేల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్, జోల్ గార్నర్, కర్ట్‌లీ అంబ్రోస్, మాల్కం మార్షల్, వెస్లీ హాల్... ఇలా ఎంతో మంది విండీస్ ఫాస్ట్ బౌలర్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. కంటికి కనిపించనంత వేగంతో వచ్చిన బంతులు ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థంగాక బ్యాట్స్‌మెన్ వికెట్లు పారేసుకునేవారు. ఎదురొడ్డి నిలవాలని ప్రయత్నించిన వాళ్లు తీవ్రంగా గాయపడేవారు. బౌలింగ్ బలానికి బ్యాటింగ్ అండ ఉండడం వల్లే కొన్ని దశాబ్దాలు ప్రపంచ క్రికెట్‌కు రారాజుగా వెలిగింది. జార్జి హెడ్లే, గారీ సోబర్స్, క్లెయివ్ లాయిడ్, డెస్మండ్ హేన్స్, గార్డెన్ గ్రీనిడ్జ్, వివియన్ రిచర్డ్స్, బ్రియాన్ లారా వంటి అసాధారణ బ్యాట్స్‌మెన్ ఆ జట్టుకు అత్యుత్తమ సేవలు అందించారు. విండీస్‌తో సిరీస్‌లు ఆడేందుకు ఏ జట్టూ సాహసించేది కాదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన విండీస్ 1983 వరల్డ్ కప్ తర్వాత క్రమంగా పతనమవుతూ వచ్చింది. చివరికి బంగ్లాదేశ్ వంటి పసికూన జట్టు చేతిలోనూ పరాజయాలను ఎదుర్కొనే స్థాయికి దిగజారింది. వరుస ఓటములే తప్ప విజయాలు లేని విండీస్ మళ్లీ గత వైభవాన్ని సంతరించుకోవడం అనుమానంగానే ఉంది.

చిత్రం.. సూపర్ ఫాస్ట్ బౌలర్లు ఆండీ రాబర్ట్స్, మైఖేల్ హోల్డింగ్, కొలిన్ క్రాఫ్ట్