ఆటాపోటీ

బ్రియాన్ లారానే గొప్ప బ్యాట్స్‌మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రికార్డులతో ముడిపెట్టకపోతే, సచిన్ కంటే బ్రియాన్ లారానే గొప్ప బ్యాట్స్‌మన్ అనే వాదన ఉంది. కళాత్మక ఆటకు అద్దం పట్టే అతని ఆట ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌కు ఒక పాఠ్యాంశం. కెరీర్‌లో 131 టెస్టులు ఆడిన లారా 11,953 పరుగులు సాధించాడు. 400 (నాటౌట్) అతని అత్యధిక స్కోరు. 34 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. 299 వనే్డలు ఆడి, 10,405 పరుగులు చేసిన లారాకు ఈ ఫార్మెట్‌లో అత్యధిక స్కోరు 189 పరుగులు. 19 శతకాలు, 63 అర్ధ శతకాలు నమోదు చేశాడు. వరుసగా ఎనిమిది టెస్టుల్లో ఏడు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 2003లో లారా 375 పరుగులు సాధించి, టెస్టుల్లో అత్యధిక స్కోరు రికార్డును నెలకొల్పాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మాథ్యూ హేడెన్ 380 పరుగులతో ఆ రికార్డును అధిగమించడం లారాలో పట్టుదలను పెంచింది. మరుసటి సంవత్సరమే అతను అజేయంగా 400 పరుగులు చేశాడు. ఒక బ్యాట్స్‌మన్ టెస్టు ఇన్నింగ్స్‌లో చేసిన అత్యధిక స్కోరు ఇదే. టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 28 పరుగులు రాబట్టడం కూడా రికార్డే. దక్షిణాఫ్రికా బౌలర్ పీటర్సన్‌పై లారా ఈ ఫీట్ సాధించాడు. అందుకే ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడయ్యాడు.

చిత్రం.. బ్రియాన్ లారా