ఆటాపోటీ

నష్టాలు ఎన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని ధ్వంసం చేయడం, దాని స్వభావాన్ని మార్చడం క్రీడాస్ఫూర్తికి విఘాతమేకాదు.. దాని వల్ల ఎన్నో నష్టాలున్నాయి. బంతిని అర్థం చేసుకోలేక బ్యాట్స్‌మెన్ అవుట్‌కావడం చిన్న సమస్యే.. కానీ, తీవ్రంగా గాయపడడం లేదా ప్రాణాలు కోల్పోవడం జరిగితే మాత్రం ట్యాంపరింగ్ అనేది క్షమార్హం కాదు. బంతి ఆకారం హఠాత్తుగా మారితే, అది ఎంత వేగంతో వస్తుందో, ఏ దిశగా దూసుకెళుతుందో ఊహించడం బ్యాట్స్‌మన్‌కు కష్టమవుతుంది. ఒక బంతి స్వభావం క్రమంగా మారడం వేరు.. హఠాత్తుగా మార్పులకు లోనుకావడం వేరు.. ఈ తేడా బ్యాట్స్‌మెన్‌ను కష్టాల్లోకి నెడుతుంది. వారు స్వేచ్ఛగా ఆడడానికి, షాట్లు కొట్టడానికి వీల్లేకుండా కళ్లాలు బిగిస్తుంది. బంతి దిశను, వేగాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యే బ్యాట్స్‌మెన్ గాయపడడం సామాన్యమవుతుంది. కొన్నిచిన్న గాయాలకు కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కానీ, బలమైన గాయాలు తగిలినప్పుడు కెరీర్ ప్రమాదంలో పడుతుంది. క్రికెట్‌ను ‘జంటిల్మన్ గేమ్’ అంటారు. అత్యంత కళాత్మక విలువలతో హుందాగా ఆడేవారు కాబట్టే దానికి ఆ పేరు వచ్చింది. కానీ, క్రికెట్ స్ఫూర్తినే బీటలు తీస్తున్న ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి సమస్యలకు ట్యాంపరింగ్ కూడా తోడైంది. ఈ విధానాలు సైబర్ నేరాలను మించిపోతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు అంటేనే సాధరణ ప్రజలతోపాటు అభిమానులు సైతం అనుమానంతో చూడడం, ఫలితాలు ముందుగానే నిర్ధారణ అయివుంటాయని అనుకోవడం సామాన్యమైంది. దీనికితోడు ట్యాంపరింగ్ వరుస కేసులు వెలుగు చూడడంతో అభిమానులకు క్రికెట్‌పై ఉన్న గౌరవం మాయమయ్యే ప్రమాదం పొంచివుంది. ప్రాణాల మీదకు తెస్తున్న ట్యాంపరింగ్‌ను సమూలంగా తుడిచిపెట్టేయాల్సిన బాధ్యత ఐసిసిపై ఉంది. నిబంధనలను మార్చేయడంతోపాటు శిక్షల తీవ్రతను పెంచితే తప్ప పెరుగుతున్న ట్యాంపరింగ్ కేసులు తగ్గ వు. అన్నిటి కంటే ముందుగా ఆటగాళ్ల వైఖరిలో మార్పు రావాలి. జయాపజయాలు ఎలా ఉన్నా, ట్యాంపరింగ్ వల్ల నష్టపోయేది, గాయపడేది, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయది కూడా సాటి క్రికెటరే అన్న వాస్తవాన్ని వారు గ్రహించాలి. లేకపోతే, ట్యాంపరింగ్ నిరాటంకంగా కొన సాగుతునే ఉంటుంది. ఎంతో మంది క్రికెటర్ల కెరీర్ నాశనమవుతునే ఉంటుంది. కొత్తగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆట గాళ్లు, ఎంత అనుభవం ఉన్నప్పటికీ టెయలెండర్లు ట్యాంపరింగ్ కారణంగా నష్టపోతున్నారు. కొంత మంది యువ క్రికెటర్లు అర్ధాం తరంగా కెరీర్‌ను ముగిస్తున్నారు. గాయాలబారిన పడి జీవితాంతం నరకాన్ని అనుభవిస్తున్నారు. బంతి వేగం, దిశ అనూహ్యంగా మారడంతో గాయపడి మరణించిన వారు కూడా లేకపోలేదు. ఆటగాళ్ల తీరు మారితేనే సమస్యకు తెరపడుతుంది.

కోహ్లీ ట్యాంపరింగ్‌పై బ్రిటిష్ పత్రికల్లో కనిపించిన ఫొటోలు