ఆటాపోటీ

షరపోవా అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ మహిళా టెన్నిస్ సంఘం (డబ్ల్యుటిఎ) అధికారులు ఆలస్యంగా నిద్ర లేచారు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడినట్టు స్వయంగా అంగీకరించిన రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాపై రెండేళ్ల సస్పెన్షన్‌ను విధించిన డబ్ల్యుటిఎ పెద్దలు ఆమె పేరును ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితా నుంచి తొలగించాలన్న విషయాన్ని మరచిపోయారు. షరపోవా మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్‌లోకి అడుగుపెడుతున్నదన్న వార్తలు ఊపందుకున్న తర్వాతగానీ ఆమె పేరు ర్యాంకింగ్స్ జాబితాలో ఉందన్న విషయం జ్ఞాపకానికి రాలేదు. గత వారం షరపోవా సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 93వ స్థానంలో ఉన్నట్టు డబ్ల్యుటిఏ ప్రకటన స్పష్టం చేసింది. అయితే, ఆమె పేరును తొలగిస్తున్నామని, సస్పెన్షన్‌కాలం పూర్తయ్యే వరకూ ఆమె పేరు జాబితాలో ఉండదని డబ్ల్యుటిఎ తాజా ప్రకటనలో తెలిపింది.
ఫ్రెంచ్ ఓపెన్‌లో డౌటే
వచ్చే ఏడాది మే నెలలో ఆరంభమయ్యే ఫ్రెండ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో షరపోవా పాల్గొనడం అనుమానంగానే కనిపిస్తున్నది. మెల్డోనియం అనే నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వాడిన కారణంగా నిరుడు జనవరిలో షరపోవాను డబ్ల్యుటిఎ రెండేళ్లు సస్పెండ్ చేసింది. దాని ప్రకారం 2017 డిసెంబర్ మాసాంతం వరకూ ఆమె మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్ ఆడేందుకు వీల్లేదు. అయితే, తాను నిర్దోషినని, నిషిద్ధ మాదక ద్రవ్యాల జాబితాలో మెల్డోనియం తాజాగా చేరిందన్న విషయం తెలియకపోవడంతో పొరపాటు జరిగిందని ఆమె క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు ముందు వాపోయింది. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత, షరపోవాపై విధించిన సస్పెన్షన్‌ను రెండేళ్ల నుంచి 15 నెలలకు తగ్గించారు. దీనితో ఆమె వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేత గార్బినే ముగురుజాతో మాడ్రిడ్‌లో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌కు అర్హతకు తగినన్ని పాయింట్లను సంపాదించడం అసాధ్యం. ఏప్రిల్‌లో మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌లోకి అడుగుపెట్టినా, నెల రోజుల వ్యవధిలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించడం కుదరదు. దీనితో ఆమె ఈ మెగా ఈవెంట్‌లో ఆడడం అనుమానంగానే మారింది. అయితే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నిర్వాహకులు ఆమెకు చోటు కల్పించే అవకాశం లేకపోలేదు.

చిత్రం..మరియా షరపోవా