ఆటాపోటీ

ఒలింపిక్స్‌కు నేమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్ ఒలింపిక్స్‌లో ఆడతాడా లేదా అన్న సస్పెన్స్‌కు తెరపడింది. బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతని సేవలు తమకు అత్యవసరమని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (బిఎఫ్‌సి) చాలాకాలం క్రితమే స్పష్టం చేసింది. బ్రెజిల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నేమార్‌ను ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు వీలుగా రిలీజ్ చేయాలని బార్సిలోనా క్లబ్‌ను కోరింది. బిఎఫ్‌సి విజ్ఞప్తిపై బార్సిలోనా నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. బ్రెజిల్‌లోనే ఆగస్టు 3 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఒలింపిక్స్ కోసం నేమార్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, జూన్ మాసంలో జరిగే కోపా అమెరికా స్వర్ణోత్సవ టోర్నమెంట్‌కు అతనిని విడుదల చేయడం లేదని తేల్చిచెప్పింది. బ్రెజిల్‌కు నేమార్ అవసరాన్ని గుర్తించామని, అందుకే ఒలింపిక్స్‌లో ఆడేందుకు అతనిని అనుమతిస్తున్నామని తెలిపింది. అయితే, ఈసారి కోపా అమెరికా వందేళ్ల పండుగను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో, ఆ టోర్నీ తమకు కీలకమని పేర్కొంది. అందుకే నేమార్ జట్టులోనే కొనసాగాలని నిర్ణయించినట్టు తెలిపింది.