ఆటాపోటీ

‘ఫుట్‌బాల్’ అవినీతిమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త అధ్యక్షుడిగా గియానీ ఇన్‌ఫాంటినో ఎన్నికైనప్పటికీ, అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఫిఫా పరిస్థితుల్లో భారీ మార్పులేవీ కనిపించడం లేదు. ఐరోపా ఖండానికి చెందిన ఇన్‌ఫాంటినో ఈ రేసులో గట్టిపోటీదారు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం ఖలీఫాను 27 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. సెప్ బ్లాటర్ వారసుడిగా, ఫిఫాకు 10వ అధ్యక్షుడిగా అవతరించాడు. ఫిఫాపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించి, సుమారు పద్దెనిమి సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగిన బ్లాటర్ నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొని ప్రతిష్ట కోల్పోయాడు. అత్యంత అవమానకరమైన రీతిలో ఆరేళ్ల సస్పెన్షన్‌కు గురయ్యాడు. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులు, భారీగా నిధులు, రెండు వందలకు పైబడిన సభ్య దేశాలతో అత్యంత బలమైన క్రీడా సంస్థగా వెలిగిపోతున్నప్పటికీ, అదే స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిఫా పగ్గాలు ఇన్‌ఫాంటినో చేతికి దక్కాయి.
అయితే, అతని ఎన్నికతో గొప్ప మార్పులేవీ చోటు చేసుకోలేదు. అవినీతిని ప్రక్షాళన చేయడంలో అతను ఇప్పటి వరకూ సఫలం కాలేదు. ముడుపులు, అధికార దుర్వినియోగం, నిధుల అక్రమ మళ్లింపు వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిఫాను ఇప్పటికీ అభిమానులు నమ్మడం లేదు. క్రీడా సంఘాలు, సమాఖ్యల్లో అవినీతి, నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతోందో చెప్పడానికి ఫిఫాలో చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. నిజానికి ఫిఫా అవినీతి ఊబిలో లోతుగా కూరుకుపోయింది. రష్యాకు అనుకూలంగా ఓటు వేయడానికి ఫిఫా కార్యవర్గ సభ్యులు భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కతార్ ఎంపిక మరింత దారుణం. హక్కుల కోసం బిడ్ వేసిన అమెరికా 17 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. అధికారికంగా 10 మిలియన్లను లాబీయింగ్ కోసం వెచ్చించినట్టు అమెరికా ప్రకటించింది. కతార్ నుంచి అంతకంటే ఎక్కువ సొమ్మును తీసుకొని, కార్యవర్గ సభ్యులంతా ఆ దేశానికి మద్దతు పలికారని అమెరికా ఆరోపణ. ఆర్థికపరమైన అవినీతికి, కుంభకోణాలకు పాల్పడిన ఫిఫా కార్యవర్గ సభ్యులపై అమెరికా మండిపడుతున్నది. ఫిఫా మాజీ కార్యవర్గ సభ్యులు జాక్ వార్నర్, నికోలాస్ లియోజ్‌లపై లెక్కలేనన్ని అభియోగాలున్నాయి. 2018, 2022 ఫిఫా ప్రపంచ కప్ టోర్నీల నిర్వహణ హక్కులను ఇవ్వడానికి భారీగా ముడుపులు స్వీకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మందిని అమెరికా నిఘా విభాగం సూచనతో జ్యూరిచ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక నేరాల్లో పేరుమోసిన వారంతా ఫిఫాలో కార్యవర్గ సభ్యులుగా ఉన్న లేదా ఉంటున్న వారు కావడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో ఫిఫాను ఇన్‌ఫాంటినో ఏ విధంగా ఉద్దరిస్తాడో చూడాలి.

చిత్రాలు..ఖేల్ ఖతం: సెప్ బ్లాటర్

ఏం చేస్తాడో: ఇన్‌ఫాంటినో