ఆటాపోటీ

సోచీకి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది బాబ్‌స్లీ, స్కెలిటన్ చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సోచీకి చుక్కెదురైంది. ఈ చాంపియన్‌షిప్స్‌ను రద్దు చేసినట్టు అంతర్జాతీయ బాబ్‌స్లీ, స్కెలిటన్ సుమాఖ్య (ఐబిఎస్‌ఎఫ్) ప్రకటించింది. కొత్త వేదికను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపింది. అయితే, ఈ చర్యను రాజకీయ కుట్రగా రష్యా అభివర్ణించింది. అంతర్జాతీయ క్రీడా రంగంలో తమను ఏకాకిగా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే సోచీ నుంచి బాబ్‌స్లీ, స్కెలిటన్ చాంపియన్‌షిప్స్ నిర్వాహణ హక్కులను ఐబిఎస్‌ఎఫ్ తీసేసుకుందని ఆరోపించింది. అయితే, రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వెలువడడమేగాక, ఈ ఏడాది జరిగిన రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన వారిలో వంద మందికిపైగా అథ్లెట్లు డోపింగ్ పరీక్షలో పట్టుబడడంతో అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) రియో ఒలింపిక్స్‌లో ఆడకుండా రష్యాను వెలివేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, చివరి క్షణాల్లో అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) అనుమతినివ్వడంతో సమస్యకు తాత్కాలికంగా తెరపడింది. కానీ, బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న చాలా మంది రష్యా అథ్లెట్లు నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు డోపింగ్ పరీక్షల్లో తేలింది. ఫలితంగా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు రష్యాను పూర్తిగా వెలివేసే ఆలోచన చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోచీలో బాబ్‌స్లీ, స్కెలిటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడంలో అర్థం ఉండదని ఐబిఎస్‌ఎఫ్ వ్యాఖ్యానించింది. అందుకే, ఆ పోటీలను సోచీ నుంచి ఉపసంహరించుకున్నామని తెలిపింది.