ఆటాపోటీ

కీపర్ కెప్టెన్లలో టాపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తూనే జట్టుకు నాయకత్వం వహిస్తూ ఒక ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల జాబితాలో ధోనీ టాపర్. అతను ఈ ద్విపాత్రాభియనం చేస్తూ 6,633 పరుగులు సాధించాడు. 1,756 పరుగులతో కుమార సంగక్కర ద్వితీయ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడాను చూస్తే, ధోనీ రికార్డును ఇప్పట్లో ఎవరూ అధిగమించే అవకాశమే లేదని స్పష్టమవుతుంది.
అంతర్జాతీయ వనే్డ టోర్నీల్లో భారత్ మొత్తం 11 పర్యాయాలు ధోనీ నాయకత్వంలో ఫైనల్ చేరింది. వాటిలో ఏడింటిలో విజయాలు సాధించగా, కేవలం నాలుగింటిని కోల్పోయింది. మహమ్మద్ అజరుద్దీన్ 19 ఫైనల్స్‌లో 11 విజయాలను సాధిస్తే, ఎనిమిది పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఈ విభాగంలో అజర్ కంటే ధోనీకే మంచి రికార్డు ఉంది.

కొత్త ఒరవడి
ధోనీ తన నాయకత్వ ప్రతిభతో భారత క్రికెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించాడు. యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లను సౌరవ్ గంగూలీ ప్రోత్సహిస్తే, ధోనీ దానిని ఓ ఆనవాయితీగా మార్చేశాడు. అతని సహకారం, ప్రోత్సాహం లేకపోతే, రోహిత్ శర్మ వంటి అంతర్జాతీయ స్టార్లు ఎదిగి ఉండేవాళ్లు కారు. మైదానంలో దిగిన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను శత్రువుల్లా చూసే విధానానికి తెరదించాడు. కెరీర్‌లో ఎన్నడూ అతను వివాదాల్లో చిక్కుకోలేదు. మైదానంలో ఎవరితోనూ ఘర్షణ పడలేదు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నాడు. ఐసిసి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను గెలిచినప్పుడు కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, రన్నరప్ జట్టు ఆటగాళ్లతో కలిసిమెలసి ఉండే సంస్కారం ధోనీకి మాత్రమే సొంతం. కెప్టెన్‌గా ధోనీ వనే్డల్లో 54 సగటుతో 6,633, టి-20 ఫార్మాట్‌లో 1,112 చొప్పున పరుగులు చేశాడు. ఈ గణాంకాలు అతని బ్యాటింగ్ ప్రతిభకు అద్దం పడతాయి.
*