ఆటాపోటీ

ప్రత్యేక హెయిర్ స్టయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధోనీ హెయర్ స్టయల్ ఎప్పుడూ చర్చనీయాంశమే. అమ్మాయలు కూడా అసూయపడేలా పొడవాటి జుట్టు కావచ్చు... అరగుండు కావచ్చు.. ఒక్కోసారి పూర్తి గుండు గీయంచుకోని ఉండొచ్చు... ‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అన్న చందంగా ధోనీ ఏం చేసినా అదొక సంచలనమే అవుతుంది. చివరికి అతని హెయర్ స్టయల్‌ను కూడా అనుకరించడం అభిమానులకు అలవాటైంది. కెరీర్‌ను ఆరంభించిన రోజుల్లో తన ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌తో ప్రత్యేకంగా కనిపించేవాడు. బాలీవుడ్ స్టార్లు బిపాసా బసు, జాన్ అబ్రహంతో స్నేహం ఉండేది. జాన్ మాదిరిగానే ధోనీ కూడా పొడవాటి జుట్టుతో, అందరి కంటే భిన్నంగా ఉండేవాడు. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రత్యేకంగా అతని తలకట్టు గురించి మాట్లాడడం, ప్రశంసించడం విశేషం. వనే్డ ప్రపంచ కప్‌ను గెల్చుకున్న వెంటనే గుండుతో దర్శనమిచ్చాడు. కొన్నాళ్లు అరగుండు ధోనీగా అలరించాడు. ధోనీ కీపింగ్, బ్యాటింగ్ మాత్రమే కాదు.. అతని ప్రతి కదలికలోనూ ఒక కొత్తదనం కనిపిస్తునే ఉంటుంది.

- శ్రీహరి