ఆటాపోటీ

కపిల్ దురదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* హేమాహేమీ ఆటగాళ్లున్న వెస్టిండీస్‌ను నిలువరించి, 1983లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను భారత్‌కు సాధించి పెట్టిన లెజెండరీ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరుమీద చాలా రికార్డులున్నాయి. వాటిలో ఒకటి కెప్టెన్‌గా అతని అద్భుత బౌలింగ్. వివియన్ రిచర్డ్స్, గార్డెన్ గ్రీనిడ్జి, క్లైవ్ లాయిడ్, డెస్మండ్ హేన్స్ వంటి అసాధారణ బ్యాట్స్‌మెన్‌తో కూడిన వెస్టిండీస్‌ను 1983 నవంబర్‌లో అహ్మదాబాద్ టెస్టులో ఢీకొన్నప్పుడు, భారత్‌కు నాయకత్వం వహించిన కపిల్ రెండో ఇన్నింగ్స్‌లో 83 పరుగులకే తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఒక కెప్టెన్‌కు టెస్టుల్లో అదే అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. కానీ, అంత కష్టపడినా ఫలితం దక్కలేదు. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ 138 పరుగుల తేడాతో గెలిచింది.

- సత్య