ఆటాపోటీ

నీళ్లలో ఫుట్‌బాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. అత్యధికంగా అభిమానులు ఉన్న క్రీడ కూడా అదే. అయితే, కొన్ని దేశాల్లో సాధారణ సాకర్ మ్యాచ్‌లంటే అభిమానులు విసుగెత్తిపోతున్నారు. అందుకే, కొత్తకొత్త తరహాలో ఫుట్‌బాల్ ఆడుతూ ఆనందిస్తున్నారు. అలాంటి అరుదైన ఫుట్‌బాల్ ఆట గ్లూసెస్టర్‌లోని బర్టన్ ప్రాంతంలోగల విండ్ష్ నదిలో జరుగుతుంది. నదిలో పాదాలు మునిగే నీటిలో ఇరు జట్లు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతాయి. కనీసం శతాబ్ద కాలంలో ఈ విధంగా నీళ్లలో సాకర్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. నియమ నిబంధనలన్నీ సాధారణ ఫుట్‌బాల్ మాదిరిగానే ఉంటాయి. మైదానం మాత్రం విండ్ష్ నదికి మారింది. వేలాది మంది ఈ పోటీలను చూడడానికి తరలివస్తారు. ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు నీళ్లు చింది మీదపడితే తడవకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ దుస్తులు వేసుకోమని ప్రేక్షకులకు నిర్వాహకులు సూచిస్తుంటారు. కానీ, అభిమానులు ఈ సూచనను పట్టించుకోకుండా, నీళ్లలో తడుస్తూ మ్యాచ్‌ని చూస్తూ ఆనందిస్తున్నారు.