ఆటాపోటీ

ఔట్లు 11 రకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా ఒక బ్యాట్స్‌మన్ 11 రకాలుగా ఔట్ కావచ్చు. బౌల్డ్ కావడం లేదా క్యాచ్ ఇవ్వడం, హిట్ వికెట్ లేదా ఎల్‌బి, రనౌట్ లేదా స్టంప్ ఔట్ కావడం.. ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన రకాలు. వీటితోపాటు బంతిని రెండుసార్లు కొట్టినా, ఆలస్యంగా క్రీజ్‌లోకి వచ్చిని, బంతిని చేత్తో తాకినా, ఫీల్డ్‌ను ఆటంకపరిచినా సదరు బ్యాట్స్‌మన్‌ను అంపైర్ ఔట్‌గా ప్రకటిస్తారు. ఒక్కోసారి బ్యాట్స్‌మన్ గాయం లేదా మరేదైనా కారణం వల్ల రిటైర్ కావచ్చు. అరుదుగా కనిపించే హ్యాడ్లింగ్ ది బాల్, అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటైనవారు చాలా తక్కువ. అయితే, భారత ఆటగాడు మహీందర్ అమర్‌నాథ్ ఈ రెండు రకాలగానూ ఔటై రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. క్రికెట్ చరిత్రలోనే ఈ విధంగా ఒకరే బంతిని చేత్తో పట్టుకోవడం, ఫీల్డింగ్‌కు అడ్డుపడడం అనే రెండు కారణాలతో ఔట్‌కావడం జరగలేదు. ఈ విషయంలో మొహీందర్ అమర్‌నాథ్‌ది ఎవరూ అందుకోలేని రికార్డుగానే చెప్పుకోవాలి.