ఆటాపోటీ

విశ్రాంతి అవసరమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది క్రికెటర్లకు వారు కోరుకుంటున్నట్టు విశ్రాంతినివ్వాలా? ఒక మ్యాచ్ లేదా సిరీస్‌లో ఆడడం, ఆడకపోవడం వారి ఇష్టమేనా? నిజానికి క్రికెటర్లకు విశ్రాంతి అవసరమా? ఇటీవల కాలంలో తెరపైకి వచ్చిన ప్రశ్నలివి. అవిశ్రాంతంగా ఆడుతున్నందున శారీరకంగా, మానసికంగా అలసిపోయానని, కాబట్టి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనడం కొత్త వివాదానికి తెరదీసింది. కోట్లాది రూపాయల విలువ ఉన్న కాంట్రాక్టుపై సంతకం చేసిన క్రికెటర్లకు మ్యాచ్‌లు ఆడినా, ఆడకపోయినా జీతం వస్తుంది. మ్యాచ్‌లు ఆడితే ఫీజు అదనం. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)తో కుదుర్చుకున్న కాంట్రాక్టులో పలు నిబంధనలు ఉంటాయి. బోర్డు ఆధ్వర్యంలో జరిగే మ్యాచ్‌ల్లో ఆడడం అందులో ఒకటి. బీసీసీఐ ఆదేశిస్తే, సిరీస్‌లు లేదా మ్యాచ్‌ల్లో ఆడనని భీష్మించుకోవడానికి వీల్లేదు. అయితే, ఆటగాళ్ల వల్లే బీసీసీఐకి కోట్లకు కోట్లు లభిస్తున్నాయి. కాబట్టి, క్రికెటర్లను, ప్రత్యేకించి కొంతమంది స్టార్లను శాసించే ధైర్యం బీసీసీఐ చేయదు. అందుకే, ఎవరికి వారు విశ్రాంతి కోరుతున్నారు? ఒకప్పుడు ధోనీ లేదా గంగూలీ, ఇప్పుడు కోహ్లీ లేదా శిఖర్ ధావన్.. జట్టులో స్థిరమైన స్థానం, స్టార్ ఇమేజీ ఉంటేచాలు.. బీసీసీఐని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం, తమ కనుసన్నల్లోనే నడిచేలా ఒత్తిడి తీసుకురావడం భారత క్రికెటర్లకు కొత్తేమీ కాదు. అయితే, క్రికెటర్లు విశ్రాంతిని కోరవడంపై ఇదివరకు ఇంత ప్రచారం జరగలేదు. ఈ స్థాయిలో చర్చ కూడా కొనసాగలేదు. ఫూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రాబ్స్ (ఎఫ్‌టీపీ)ని ఖరారు చేసే సమయంలో, ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమన్న విషయాన్ని గమనించకుండా షెడ్యూల్‌ను ఖరారు చేస్తున్నారని కోహ్లీ మండిపడడంతో ఈ అంశంపై వాదోపవాదనలు మొదలయ్యాయి.
క్రికెటర్లు కూడా మనుషులేననీ, యంత్రాల్లాగా నిరంతరాయం పని చేయడం అసాధ్యమని ఒక వాదన బలంగా వినిపిస్తున్నది. ఆటగాళ్ల సంఘం సైతం ఎఫ్‌టీపీ షెడ్యూలింగ్‌లో జాగ్రత్త పడాలని అంటున్నది. సుమారు రెండేళ్లుగా తాము విశ్రాంతి లేకుండా ఆడుతున్నామని, శరీరం ఇప్పుడు విశ్రాంతిని కోరుతున్నదని కోహ్లీ స్పష్టం చేస్తున్నాడు. అతని డిమాండ్‌కు బీసీసీఐ తలవంచక తప్పలేదు. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని, శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి కోహ్లీకి విశ్రాంతినిస్తున్నట్టు ప్రకటించింది. రొటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న పేరుతో, స్టార్ క్రికెటర్ల డిమాండ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, వారి ఇష్టాయిష్టాల ప్రకారమే మిగతా జట్టును ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఇటీవల కాలంలో ఈ జాఢ్యం మరింత పెరిగింది. ఒకప్పుడు సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ధోనీ వంటి క్రికెటర్ల స్టార్ ఇమేజ్‌కి భయపడి, వారు కోరుకున్న రీతిలోనే నిర్ణయాలు తీసుకున్న బీసీసీఐ ఇప్పుడు విరాట్ కోహ్లీకి జై కొడుతున్నది. శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో అతను లేకపోతే సమస్యలు తప్పవని, అతని మాదిరి జట్టుకు స్ఫూర్తిదాయమైన నాయకత్వాన్ని అందించేవారు లేరని వ్యక్తమైన అభిప్రాయాలను బీసీసీఐ ఏమాత్రం పట్టించుకోలేదు. విశ్రాంతి అనేది లేకుండా వరుస టోర్నీలు, సిరీస్‌లు ఆడించడం మంచిది కాదని బీసీసీఐ ఇస్తున్న వివరణ. ఈ కోణంలోనే సమస్యను పరిశీలించి, కోహ్లీకి విశ్రాంతినిచ్చామని అంటున్న బోర్డు కాంట్రాక్టులోని అంశాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనేది స్పష్టం చేయడం లేదు.
క్రికెటర్లను యంత్రాలుగా చూడకూడదన్న వాదనను ఎవరూ కాదనడం లేదు. అయితే, మ్యాచ్‌లు ఆడినా, ఆడకపోయినా, ‘ఏ’, ‘బీ’, ‘సీ’ గ్రూపుల కింద వారికి జీతాన్ని ఎందుకు ఖరారు చేయాలి? ఏటా కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాలి? కోహ్లీ వంటి ఆటగాళ్లు ఉన్న ‘ఏ’ గ్రూప్‌లోని క్రికెటర్లకు ప్రస్తుతం ఏటా రెండు కోట్ల రూపాయల జీతం లభిస్తున్నది. త్వరలోనే ఇది ఏటా 12 కోట్ల రూపాయలకు పెరగనున్నట్టు సమాచారం. పాత మొత్తానే్న లెక్కలోకి తీసుకున్నా, నెలకు వారు 16 లక్షలకుపైనే సంపాదిస్తున్నారు. క్రికెటర్ల ఇష్టానుసారం షెడ్యూల్‌ను ఖరారు చేయాలంటే, అసలు కాంట్రాక్టు కింద జీతం ఎందుకు? మ్యాచ్‌లు లేదా సిరీస్‌ల్లో ఆడే ఆటగాళ్లకు మాత్రమే జీతాన్ని, మ్యాచ్ ఫీజును ఖరారు చేయవచ్చు కదా? ఈ ప్రశ్నలకు బీసీసీఐ నుంచి సమాధానం లేదు. వ్యక్తిగత కారణాలతో ధావన్ ఇటీవల కాలంలో చాలాసార్లు టోర్నీ లేదా సిరీస్ మధ్య నుంచే వెళ్లిపోతున్నాడు. తాను ఫలానా మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదని ప్రకటించేస్తున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, కోహ్లీ అంత సులభంగా ఆ మాట చెప్పలేకపోయినా, పట్టుబట్టి మరీ విశ్రాంతిని సంపాదించాడు. కాంట్రాక్టును బీసీసీఐ ఏఏ అంశాల ప్రాతిపదికన ఇస్తున్నది? వారికి ప్రజల్లో ఉన్న క్రేజీని బట్టే అన్నది వాస్తవం. ప్రజాభిమానం ఉన్నవారు మ్యాచ్‌ల్లో ఆడితే, స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. ప్రసార హక్కులకు కోట్ల రూపాయలు లభిస్తాయి. అందుకే, కోట్లకు కోట్లు వెచ్చించి మరీ వారిని పోషిస్తున్నది. మ్యాచ్‌లు ఆడితే అదనంగా చెల్లింపులు చేస్తున్నది. ఆపైన వారి డిమాండ్లకు తలవంచుతున్నది. విశ్రాంతి అత్యవసరమని కోరుకుంటున్న క్రికెటర్ల కాంట్రాక్టును రద్దు చేసిన తర్వాతే ఆ డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే బీసీసీఐని ఎవరూ విమర్శించరు. అంతేగానీ, కోట్ల రూపాయలు చెల్లిస్తూ, వారి డిమాండ్లకు తలవంచుతూ, ఒక కోటరీగా వ్యవహరిస్తే మాత్రం ప్రజలు క్షమించరు. ప్రజాభిమానం కోల్పోతే, ఆ తర్వాత కోలుకోవడం సులభసాధ్యం కాదని బీసీసీఐ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.