అక్షర

లోకాయతన పురోహితుని విఫల ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాబాలి
ఏకాంక రూపకం
రచన: నార్ల వెంకటేశ్వరరావు
పేజీలు: 80, వెల: రు.60/-
ప్రచురణ: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్
విజయవాడ

‘జాబాలి’ అనే ఆయన దశరథుని పురోహితులలో ఒకడు. మానసికంగా లోకాయతన వాది అయినా, లౌకికంగా ఆస్తికుడుగా, యజ్ఞయాగాదు లలో నమ్మకం వున్న ఆధ్వర్యుడుగా వ్యవహరిస్తున్నవాడు. వశిష్ఠ మహర్షికి అనుయాయిలా ‘బూటక’ పాత్రధారిగా చరిత్ర నడుపుతూ వున్నవాడు.
నార్ల వెంకటేశ్వరరావు వ్రాసిన ఇరవై పేజీల ఏకాంక రూపకం యిది. ఇరవై పేజీల నాటకానికి యాభయి పేజీల పీఠిక సమకూర్చడంలో రచయితకు ప్రత్యేక ప్రయోజనం వున్నది. అది జనాభిప్రాయంలో పాతుకుపోయిన మూఢ సిద్ధాంతాలను ఎలాగయినా తార్కికంగా పరిహరింపచేయాలని. సంస్కృత రామాయణంలో లేని అనేక సన్నివేశాలు, సందర్భాలు ఎలా తరువాత ప్రచురణలలో ‘వాల్మీకం’ గానే రూపుకట్టుకున్నాయో చూపించడంకోసం యింత పీఠిక అవసరం అయింది. రామాయణాన్ని గురించి విపుల పరిశోధనలుచేసి సిద్ధాంత వ్యాఖ్యానం వంటి పుస్తకాలు రాసిన జాకోబ, సి.వి.వైద్యాల ప్రమాణాలు ఉటంకిస్తూ తేల్చిన విషయం యేమంటే, మనం ఆదికావ్యం అనుకుంటున్న రామాయణం, వాల్మీకి తరువాత వచ్చిన కవులు తమతమ స్వంతభావాలను కూడా యిందులో పొదిగి పుస్తకాన్ని అప్రమాణికం చేశారని. పరస్పర విరుద్ధమయిన విషయాలు రామాయణ శ్లోకాలలో కొల్లలుగా వున్నాయని సోదాహరణంగా చూపారు.
రూపకంలో ప్రధాన అంశం యేమంటే- రాముడు వనవాసం చేయకుండా రాజ్యాధికారం స్వీకరించి ప్రజలను ధార్మికంగా పరిపాలించాలని జాబాలి అనే లోకాయన పురోహితుని అభిలాష. ఈ విషయాన్ని తనకు యింతకు ముందే తెలిసిన, వశిష్ఠులవారు చెప్పిన పరమరహస్యాన్ని రామునికి చెప్పి ఆయనను తన కోరికకు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం విఫలమయిపోవడం. తన అభిప్రాయాలతో రాముడిని మొదటినుంచి చికాకు పరుస్తూ, జాబాలి వశిష్ఠుడు వచ్చిన తరువాత కథను మలుపుతిప్పి తన నాస్తికతను పునఃప్రతిష్టితం చేసుకుంటాడు. రాముడిని పరీక్షించటానికీ యింతసేపూ తన పిడివాదం అంతా చేశానని చెప్పుకుంటాడు. వశిష్ఠుని మీద తనకున్న అనుమానాలన్నీ విడవకుండా బయటపెట్టగలిగి కూడా అవన్నీ తాను ఆడుతున్న నాటకం’ అని భ్రమింపచేస్తాడు.
నార్లవారు ఈ ఏకాంక రూపకానికి సంస్కృత రామాయణంలోని అయోధ్యకాండకు చెందిన 108-109 సర్గల కథనాన్ని ఆధారంగా తీసుకున్నారు. జాబాలిని ‘మానవతావాది’గా రూపొందించారు. ‘తమ విశ్వాసం కోసం కవులనాహ్వానించలేని ప్రాణాలు అర్పించలేని విస్మృత వర్గానికి చెందినవాడు జాబాలి’ అంటారు. (పే.57). రచన చాల సరళంగా సాగి విషయాన్ని గంభీరంగా చదువరుల ముందుకు తీసుకువస్తుంది.
ఈ పుస్తకాన్ని ‘మహాకవి, మానవతావాది దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారికి ప్రేమ, గౌరవాలతో’ అంకితం యిచ్చారు.
తెలుగుపాఠకులందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం యిది. కథ (డ్జ్గకూ) వేరు, చరిత్ర (్హనిడ్జ్గకూ) వేరు అన్న విషయం నిర్ధారణ చేసుకోవటానికి ఉపకరించే పుస్తకం. రామాయణం చారిత్రాత్మకం గ్రంథం కాదు, చక్కని కావ్యం అని తెలుసుకోవటానికి పీఠిక ఎంతగానో ఉపకరిస్తుంది. రూపకాన్ని మటుకే రాసి వూరుకోకుండా, విపులమయిన పీఠికను కూడా అందించినందుకు రచయితకు పాఠకులందరూ ఋణపడి వుంటారు.

-‘శ్రీ’