అక్షర

మీరేం మాట్లాడుతున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరేం మాట్లాడుతున్నారు?
-డి.రామచంద్రరాజు
వెల: రూ.135/-
ప్రతులకు: డి.సుజాత
డోర్ నెం.4/1979-2,
బాలమురుగన్ స్ట్రీట్
దుర్గానగర్ కాలనీ,
చిత్తూరు-517 002
99083 24214

మొహమాటం లేకుండా సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా మీ గురించి మీరు ఆలోచించుకునేలా, మీ గతాన్ని గురించి పునరాలోచించుకునేలా మీకు ప్రేరణ కలుగజేసే పుస్తకం ఇది. పాటలకు, మాటలకే కాక అక్షరాలకు, భావాలకు కూడా ఒక లయ ఉంటుంది. ఆ లయ తెలిసిన రచయిత రాసిన కథయినా, నవల, నాటకం, పాట, సాహిత్యం ఏదైనా చదువరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. దానికి తోడు అధ్యయనం, అనుభవం తోడైన రచయిత చేసే రచనలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. సులభంగా చదివించడమే గాక జీవితం, సమాజం పట్ల ప్రేమను, బాధ్యతను కలుగజేస్తాయి. అలాంటి జీవితానుభవం కలిగిన కవి, వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయిత రామచంద్రరాజు. ‘మీరేం మాట్లాడుతున్నారు?’ అనే పుస్తకాన్ని చదివాక బహుశా ప్రపంచం పట్ల, సమాజం పట్ల, సమస్త మానవ సంబంధాల పట్ల, జీవితం పట్ల కొత్త ఎరుక కలుగుతుందేమోనన్న భావన. మనుషులు దగ్గర కావాలంటే ప్రేమ, కరుణ, బాధ్యతలు తెలిసి ఉండాలి. జీవించటం తెలిసి ఉండాలి. మాట విలువ, మనిషి విలువ తెలిసి ఉండాలి. అలా తెలుసుకోవడమే.. ఈ పుస్తకం.