బిజినెస్

జీఎస్టీ స్థిరీకరణ జరిగితే.. నెలకు లక్ష కోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశవ్యాప్తంగా వస్తు సేవా పన్ను రాబడి ఎప్పటికప్పుడు ఇనుమడిస్తోంది. పన్నుల ఎగవేత నిరోధక చర్యలను మరింత పటిష్టంగా అమలు చేస్తే జీఎస్టీ ద్వారా నెలకు లక్ష కోట్ల రూపాయల మేర పన్ను వసూలయ్యే అవకాశం ఉందని తాజా లెక్కలను బట్టి స్పష్టమవుతోంది. ముఖ్యంగా జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ స్థిరీకరణ ప్రక్రియ పూర్తయితే ఆయా వ్యక్తుల ఆదాయ వ్యయాలకు సంబంధించి ప్రొఫైలింగ్‌ను పటిష్టమైన రీతిలో చేపట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా 7.44 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం లభించగలదని ప్రభుత్వం అంచనా వేసింది. జూలై -్ఫబ్రవరితో ముగిసిన ఎనిమిది నెలల కాలంలో జీఎస్టీ ద్వారా 4.44 లక్షల కోట్లు వసూలైంది. ఏప్రిల్ 1నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం జీఎస్టీ వసూళ్లలో స్పష్టత రావొచ్చని చెబుతున్నారు. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం ఎంత ఉంటుందనే దానిపై ఇప్పటికిప్పుడే చెప్పలేమని, ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి ఈ ఆదాయం నెలకు లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారం ఆభరణాల పరిశ్రమకు సంబంధించి లోపాలను కూడా పూర్తిగా నిరోధించగలిగితే పన్ను వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పదిశాతం కస్టమ్స్ సుంకం వేసినా కూడా ప్రతి నెలా బంగారం దిగుమతులు పెరుగుతున్నాయని పేర్కొన్న ఓ అధికారి, ఈ దిగుమతి అయిన బంగారం ఎటు వెళ్తుందన్న విషయం అంతబట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ బంగారం ఎవరి చేతుల్లోకి వెళ్తోందన్న దానిపై వివరాలు సేకరించే అధికారం రెవిన్యూ అధికారులకు ఉంటుందని చెబుతున్నారు. చైనా తరువాత అత్యధిత స్థాయిలో భారత్ దేశమే బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతి అయిన బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీకే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం జీఎస్టీ వ్యవస్థ అమల్లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని తొలగించి ఈ ప్రక్రియను స్థిరీకరించగలిగితే పూర్తిస్థాయిలో బంగారం దిగుమతి, వినియోగంపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని వెల్లడించారు.