సంపాదకీయం

ప్రచారం కాని ‘దోపిడీ’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ‘ఆహార శుద్ధి’-్ఫడ్ ప్రాసెసింగ్-పారిశ్రామిక వ్యవహారాల మంత్రిణి హరిస్మృత కౌర్ బాదల్‌ను పదవి నుంచి తొలగించాలని ‘స్వదేశీయ జాగరణ మంచ్’-స్వజామ-వారు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయడం గురించి ప్రచారం జరగడం లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో చివరి ఘట్టం పోలింగ్ జరుగుతుండిన సమయంలోనే ‘స్వజామ’ వారు ‘్భజపా’ ప్రభుత్వం వారి పెట్టుబడుల విధానాన్ని మరోసారి వ్యతిరేకించడం ఆసక్తికర పరిణామం! చిల్లర వ్యాపారంలో పెట్టుబడులను పెట్టడానికి విదేశీయ సంస్థలను అనుమతించాలన్న విధానాన్ని ‘స్వదేశీయ జాగరణ మంచ్’ వంటి జాతీయతా భావ సంస్థలు ఏళ్ల తరబడి వ్యతిరేకిస్తున్నాయి. 2014 మే 26వ తేదీకి పూర్వం భారతీయ జనతాపార్టీ కూడ ‘స్వదేశీయ జాగరణ మంచ్’తో గళం కలిపింది, చిల్లర వ్యాపారంలోకి విదేశీయ సంస్థల పెట్టుబడులను అనుమతించరాదని కోరింది. కానీ, తరువాత కథ వేఱు.. విదేశీయ సంస్థలకు మన చిల్లర వ్యాపారాన్ని అప్పగించడం ద్వారా స్వదేశీయ సంస్థలను ‘దివాలా’ తీయించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంద్న అనుమానం కలగడం సహజం! ‘్భరత్‌లో నిర్మించండి’ అన్నది మోదీ ప్రధాన మంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వమన్నది జరుగుతున్న ప్రచారం! కానీ, ఈ స్ఫూర్తికి వ్యతిరేకమైన వివిధ పరిణామాలు ‘్భజపా’ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిపోతుండడం గురించి పెద్దగా ప్రచారం కావడం లేదు! హరిస్మృత కౌర్ బాదల్ నాయకత్వంలోని మంత్రిత్వ విభాగం వారు అతి ఉత్సాహంగా మరింత ముందుకెళ్లారు. ఆహార శుద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమలలో సైతం విదేశీయులు చొరబడిపోవాలన్న సరికొత్త విధానానికి ఈ అతి ఉత్సాహం కారణం! ఆహా రం శుద్ధి చేసి డబ్బాలలో నిలవ ఉంచే పరిశ్రమలలోను, సరఫరా చేసే దుకాణాలలో పెట్టుబడులను అ నుమతించాలన్నది హరిస్మృ త కౌర్ బాదల్ మంత్రిత్వ శాఖ రూపొందించిన విధానం! ఈ విధానాన్ని ఆమోదించాలని కోరుతూ మంత్రివర్గానికి ప్రతిపాదనలను పంపిన బాదల్‌ను, ఆమె మంత్రిత్వ విభాగాన్ని ‘స్వజామ’ తప్పుపట్టింది. ఈ ప్రతిపాదన చేస్తున్న బాదల్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నది ‘మంచ్’ చేసిన విజ్ఞప్తి! ఈ విజ్ఞప్తిని ప్రధానమంత్రి పట్టించుకోలేదు. కానీ ‘్భజపా’తో భావస్వామ్యం కల జాతీయ సంస్థ అయిన ‘స్వజామ’ ఇలా బాదల్‌పై ధ్వజమెత్తడమే ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పరిణామం! బాదల్ ‘ప్రతీక’ మాత్రమే.. ‘స్వజామ’ నిజానికి మోదీ ప్రభుత్వం వారి ‘విదేశీయ ప్రత్యక్ష నిధుల’-్ఫరిన్ డైరక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్-ఎఫ్‌డిఐ-విధానాన్ని ఇలా మరోసారి నిరసించింది..
చిల్లర వ్యాపారంలో విదేశీయ సంస్థలు ప్రవేశించాయా? లేదా? అన్న విషయమై గత రెండున్నర సంవత్సరాలుగా స్పష్టత లేదు! అసలు ప్రభుత్వం రెండు దశాబ్దులుగా పాటిస్తున్న విదేశీయ ప్రత్యక్ష నిధుల-ఎఫ్‌డిఐ విధానమే పెద్ద గందరగోళం! ఎఫ్‌డిఐ వల్ల గొప్ప మేలు జరుగుతోందన్న ప్రచారంలోని సత్యాసత్యాలు ఆర్థిక నిపుణలకే అంతుపట్టడం లేదు. ‘ఎఫ్‌డిఐ’ చొరబాటువల్ల స్వదేశీయ ఆర్థిక వ్యవస్థకు అంతర్గతంగా చెదలు పడుతున్న సంగతి గురించి విద్యావంతులకు ధ్యాస లేదు, సామాన్య జనాలకు ధ్యాస లేదు! దాదాపు అన్ని రాజకీయ పక్షాలు కూడ ‘ఎఫ్‌డిఐ’ని సమర్ధిస్తుండడం వల్ల ఇలా ‘చెదలు పడుతున్న’ వాస్తవం గురించి ప్రచారం కావడం లేదు, ఎన్నికలలో ఈ సంగతి చర్చకు రావడం లేదు! చిల్లర వ్యాపారంలో విదేశీయులు చొరబడడాన్ని, పెట్టుబడులు పెట్టడాన్ని మాత్రమే 2014 నాటి లోక్‌సభ ఎన్నికలకు ముందు భాజపా వ్యతిరేకించింది. మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ ఆధ్వర్యంలో మన నెత్తికెక్కిన ‘ఎఫ్‌డిఐ’ విధానాన్ని మాత్రం భాజపా వ్యతిరేకించడం లేదు. విదేశాల నుంచి పెట్టుబడులను తెప్పించడానికి మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంటె మిన్నగా భాజపా ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది! విభేదం చిల్లర వ్యాపారంలో ‘ఎఫ్‌డిఐ’కి మాత్రమే పరిమితం...
కానీ, చిల్లర వ్యాపారంలోకి విదేశీయ సంస్థలు చొరబడిపోయాయి. ‘వాల్‌మార్ట్’ అన్న అమెరికా సంస్థ వారి చిల్లర దుకాణాలు మూతపడలేదు. ‘వాల్‌మార్ట్’కు అనుమతి లేదని ఒకసారి, ఉందని ఒకసారి ప్రచారం జరుగుతోంది! ఈ ‘వాల్‌మార్ట్’ అన్న దోపిడీ దళారీ సంస్థకు అక్రమ ప్రయోజనం సమకూర్చడానికి మాత్రమే అప్పటి అమెరికా అధ్యక్షుడు బర్రాక్ హుస్సేన్ ఒబామా 2010-2012 మధ్యకాలంలో అప్పటి మన ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు! చిల్లర వ్యాపారంలోకి విదేశీయ సంస్థల పెట్టుబడులను 2012లో మన ప్రభుత్వం అనుమతించింది! ఈ విషయంలో విభేదించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మన్‌మోహన్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకోవడం అప్పుడు గొప్ప పరిణామం. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షమైన ‘్భజపా’ వారు ‘వాల్‌మార్ట్’ దుకాణాలను తెరవనివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు వాల్‌మార్ట్ దుకాణాలు నడుస్తున్నాయా? లేదా?? భారతీయ సంస్థలతో అనుసంధానం కుదుర్చుకుని ‘వాల్‌మార్ట్’ తన దుకాణాలను నడిపిస్తోం దా? స్వ తంత్రంగానే నడుపుతోం దా? చిల్లర వ్యాపారంలోకి ఎన్ని విదేశీయ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ చొరబడి ఉ న్నాయి? ఈ మొత్తం వ్యవహారంపై కేం ద్ర ప్రభుత్వం ‘శే్వతపత్రం’ రూపొందించి విడుదల చేసినట్టయితే స్పష్టత ఏర్పడుతుంది! దాదాపు అన్ని రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధిస్తున్నాయి. అందువల్ల దేశాన్ని దివాలా తీయించనున్న ‘ఎఫ్‌డిఐ’ గురించి ప్రభుత్వాల వారు, రాజకీయ పక్షాల వారు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదు. అందువల్ల ఎలాంటి ప్రచారం లేదు, ప్రజలకు సంభవించనున్న విపత్తు గురించి అవగాహన కలగడం లేదు! చైనాకు చెందిన వాణిజ్య సంస్థలు, మన భూభాగాలను దురాక్రమించిన చైనా దేశపు సంస్థలు మన దేశపు వాణిజ్య అధిక రంగాలను దురాక్రమిస్తున్నాయి! అమరావతి నిర్మాణంలో కూడ ఈ సంస్థలు-శత్రుదేశమైన చైనా సంస్థలు-కీలకపాత్రను పోషిస్తాయట! మన ప్రభుత్వాలకు మతిపోయిందా? దేశభద్రత పట్ల మమకారం నశించిపోయిందా??
ఆహార రంగంలోని చిల్లర వ్యాపారంలోకి విదేశీయ సంస్థలు ఇదివరకే చొరబడినాయి. గత ఏడాది జూన్‌లో ఈ మేరకు మన ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది! చిల్లర వ్యాపారం కంటె మరింత వౌలికమైనది ఆహార రంగంలోని చిల్లర వ్యాపారం.. ఈ విదేశీయుల చిల్లర దుకాణాలలో స్వదేశంలో తయారైన ఆహార పదార్ధాలను మాత్రమే విక్రయించాలన్నది ప్రభుత్వం గత జూన్‌లో విధించిన నిబంధన. ఈ నిబంధనను కూడ సడలించాలని అనేక దేశాలవారు కోరుతున్నారట! అందువల్ల సడలించాలని ఆహార శుద్ధి, పారిశ్రామిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది! మంత్రివర్గం ఆమోదిస్తే మన దేశంలోని విదేశీయుల దుకాణాల్లో విదేశీయ ఆహారమే అమ్ముతారు..