ఇళయరాజా చెప్పడంతో ఈ సినిమా చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అబ్బాయితో అమ్మాయి’ దర్శకుడు రమేష్ వర్మ
----------------------------
నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో జె.జి. సినిమాస్, కిరణ్ స్టూడియో పతాకాలపై తెరకెక్కుతున్న చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 1న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రమేష్ వర్మ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
‘వీరా’ సినిమా తరువాత గ్యాప్ రావడానికి గల కారణం, ఓ మంచి లవ్‌స్టోరీని తెరకెక్కించాలని అన్నీ రెడీ చేసుకున్నాను. ఆ సినిమాకు బడ్జెట్ కూడా ఎక్కువే. నాగశౌర్యతోనే అనుకున్నాను. కానీ బడ్జెట్ ఎక్కువవడంవల్ల సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. నిజానికి నాగశౌర్యను నేనే పరిచయం చేయాలి. కానీ ఈ సినిమా ఆగిపోవడంతో తను వేరే సినిమాలు చేశాడు. ఆ తరువాత నేను కూడా ఈ ప్రాజెక్టును ప్రక్కన పెట్టాను. ఆ తరువాత రెండేళ్లకు మళ్లీ నాగశౌర్యతోనే ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. నిజానికి ‘వీరా’ సినిమా రవితేజ కోసం అనుకున్నది కాదు. ఓ నిర్మాత ప్రోత్సాహంతో బాలకృష్ణగారికోసం రాసుకున్న కథ అది. కానీ ఆయనతో కుదరకపోవడం, ఆ కథ రవితేజకు నచ్చడంతో సినిమా చేశా. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. దాన్ని బేస్ చేసుకుని పాజిటివ్‌గా వెళ్ళే కథ ఇది. నిజ జీవితంలో వాస్తవానికి, కల్పితానికి తేడా ఏమిటనేది చూపిస్తుంది. ఇది రెగ్యులర్ ఫార్మెట్‌లో వుండే లవ్‌స్టోరీ కాదు. సినిమా మొత్తం ఏం జరుగుతుందనే ఎగ్జైట్‌మెంట్‌తో సాగుతుంది.’
‘నేను అనుకున్నట్టుగానే నాగశౌర్య చక్కటి నటన కనబరిచాడు. నిజానికి అతన్ని ముందు పరిచయం చేసి ఈ సినిమా చేసివుంటే ఇంత బాగా వస్తుందని అనుకోను. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుని చేశాడు. అలాగే హీరోయిన్ కూడా అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఇళయరాజాగారి సంగీతం. నేను ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా పక్కనపెట్టిన తరువాత ‘వస్తా నీవెనుక’ అనే సినిమా చేయాలని ఇళయరాజాగారిని కలిశాను. ఆ సమయంలో ఆయనకు ఈ కథ చెప్పడంతో బాగుంది, ముందు ఇదే ప్రారంభించు అని చెప్పడంతో ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా ప్రారంభించాను. ఈ సినిమాకు నిర్మాతల సపోర్టు కూడా ఎంతో వుంది. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి సినిమాను రూపొందించే అవకాశం కల్పించారు. అలాగే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కొత్త ఫీల్ కలిగేలా చిత్రాన్ని తెరకెక్కించా. నేను ఇదివరకు చేసిన సినిమాలకు ఈ సినిమాకు చాలా తేడా కన్పిస్తుంది. ఇటీవలే సినిమాను నా స్నేహితులు డిస్ట్రిబ్యూటర్లకు చూపించాను. అందరూ బాగుందని మెచ్చుకోవడంతో సినిమాపై గట్టి నమ్మకం వుంది. ఈ సినిమా తరువాత ‘వస్తా నీ వెనుక’ చిత్రాన్ని మొదలుపెడతా. నిజానికి ఆ టైటిల్‌ని మార్చేశా. ‘ఇదేదో బాగుందే చెలీ’ టైటిల్‌ను అనుకుంటున్నాను’ అంటూ ముగించారు.

-శ్రీ