అనంతపురం

కుదురేముఖ్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నీలినీడలు.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 4 : వరుస కరవుపీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. అందులోప్రధానంగా ఎంతో ముఖ్యమైన ఇనుప ఖనిజం నిల్వలు అధికంగా ఉన్నాయి. అయితే డీ హీరేహాళ్ ప్రాంతంలో ఒక ప్రైవేటు వ్యక్తికి దీనిని అప్పగించడం వల్ల ప్రజల సంపదను అంతా కొల్లగొట్టారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం వీటి ఆధారంగా కుదిరేముఖ్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రెండేళ్ల క్రితమే ప్రకటించింది. ఈ మేరకు మూడు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందాలు సైతం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఇప్పటివరకూ దాని ఊసే లేకపోవడం గమనార్హం. అయితే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది.రాష్ట్రంలోతెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ దానిపై ఎలాంటి కదలిక లేకపోవడంతోపరిశ్రమ ఏర్పాటు చేస్తారా లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు వద్ద కుదురేముఖ్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా 2013 జూన్ 22న ఎపిఎండిసి, ఆర్‌ఐపియల్(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖ ఉక్కు), కుదురేముఖ్ ఇలా ఈ మూడు ప్రభుత్వ సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇలా ఈ పరిశ్రమను రూ.1500 కోట్లతో స్థాపించాలని ఆ ఒప్పందాల్లో పేర్కొన్నారు. దీనివల్ల ఏడాదికి 1.2 మిలియన్ టన్నులకు తక్కువ కాకుండా ఉత్పత్తిని చేపట్టాలని నిర్ణయించారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా అనంతపురం జిల్లాలోప్రత్యక్షంగా, పరోక్షంగా 3500 మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. అప్పటి రెవెన్యూ మంత్రి గా ఉన్న ఎన్.రఘువీరారెడ్డి పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ కూడా చేశారు.అయితే అప్పటి నుంచీ ఇప్పటివరకూ అంతకు మించి ఈ పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి కదలిక లేదని చెప్పవచ్చు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత రాష్ట్ర విభజన జరగడం, ఎన్నికలు రావడంతోతెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అనంతరం డీహీరేహాళ్ మండలంలోని ఇనుప ఖనిజం ఉన్న ప్రాంతాన్ని లీజుకు ఇవ్వాలని మూడు పర్యాయాలు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌కు(ఐబియం) ఎపిఎండిసి దరఖాస్తు చేసుకుంది. అయితే ఇలా దరఖాస్తు చేసుకున్న ప్రతిమారూ అది తిరస్కరణకు గురవుతూ వచ్చింది. అక్కడ ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకే ఇలా ఎపిఎండిసి చేసుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్థానికంగా పలు ఉద్యమాలు ప్రారంభమైనా, సిపిఎం యాత్ర చేపట్టినా ప్రభుత్వం లో ఏ మాత్రం కదలిక లేకపోవడం గమనార్హం. అక్కడ ఉన్న ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల మరోమారు ప్రజా సంపదకు గండి పడనుండడంతోపాటు ఇప్పటివరకూ చేసుకున్న ఒప్పందాలు అన్నీ నీటి మూటలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల 3500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉండడం వల్ల జిల్లా ప్రజాప్రతినిధులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు.