ఆంధ్రప్రదేశ్‌

ఏసిబికి చిక్కిన జాయింట్ సబ్‌రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: ఇంటి రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీపై 1 శాతం లంచం డిమాండ్ చేసిన జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ శుక్రవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్పీ కింజరాపు రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలు మేరకు.. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన జెఎస్ శివప్రసాద్ నగరంలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. దీని రిజిస్ట్రేషన్ నిమిత్తం స్టాంప్ డ్యూటీని బ్యాంకు చెలానా ద్వారా చెల్లించాడు. అయితే రిజిస్ట్రేషన్ విలువపై ఒక శాతం మొత్తాన్ని తనకు లంచంగా ఇవ్వాలని సూర్యాభాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పి పోతురాజు డిమాండ్ చేశాడు. అంతమొత్తం ఇచ్చుకోలేనని చెప్పిన శివప్రసాద్ చివరికి 12వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని, ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు రూపొందించిన పథకం ప్రకారం ఈ మొత్తంలో రూ.10 వేలను శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో ఇచ్చేందుకు ప్రయత్నించగా, ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె అప్పారావుకు ఇవ్వాల్సిందిగా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సూచించాడు. డాక్యుమెంట్ రైటర్ ఎన్ షణ్ముఖరావు ద్వారా జూనియర్ అసిస్టెంట్ అప్పారావు రూ.10వేలను తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.