తెలంగాణ

అకడమిక్ క్యాలెండర్‌ను మధ్యలో మార్చడమేంటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులకు నష్టమని ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాష్ట్రంలో అర్ధాంతరంగా అకడమిక్ క్యాలండర్‌ను మార్చడం వల్ల విద్యార్ధులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పేర్కొన్న విధంగానే మార్చి 21 నుండి విద్యార్ధులపై తరగతుల సిలబస్‌ను బోధించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించిన మీదన రూపొందించిన అకడమిక్ క్యాలండర్‌ను అర్ధాంతరంగా మారిస్తే విద్యార్ధులకు తీరని నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో నిర్ణయించిన ప్రకారం మార్చి 2వ వారంలోనే వార్షిక పరీక్షలు నిర్వహించారని, మార్చి 20 నాటికి ఫలితాలను ప్రకటిస్తున్నారు కనుక మార్చి 21 నుండి ఏప్రిల్ 23 వరకూ పై తరగతులను బోధించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి చావ రవి పేర్కొన్నారు. అందుకు భిన్నంగా దిగువ తరగతి సిలబస్‌ను రివిజన్ చేయాలని అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ తరగతి సిలబస్‌ను పునశ్చరణ చేస్తామంటే పిల్లలకు ఏం ఆసక్తి ఉంటుందని అన్నారు. నూతన సిలబస్, బోధనకు వచ్చే విద్యాసంవత్సరానికి సమయం సరిపోదని, సిలబస్ కూడా పూర్తి కాదని, పిల్లలు, ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురికావల్సి వస్తుందని అన్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రకటించిన విధంగానే పై తరగతుల సిలబస్‌ను బోధించే విధంగా చూడాలని అకడమిక్ షెడ్యూలులో ఎలాంటి మార్పులు చేయరాదని డిమాండ్ చేశారు.