రాష్ట్రీయం

ఆ ఉత్తరాలు ఉత్తుత్తివే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: అవినీతికి పాల్పడుతున్న మీపై ఎసిబి దాడులు చేయబోతోందని, కొంత డబ్బు చెల్లిస్తే ఆ ప్రమాదంనుంచి తప్పుకోవచ్చంటూ ఎసిబి పేరిట కొందరు అధికారులకు ఉత్తరాలు రాసిన నిందితుడిని గుర్తించామని, అలాంటి బెదిరింపు ఉత్తరాలను నమ్మవద్దని, మోసపోవద్దని ఎసిబి డైరక్టర్ జనరల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల అధికారులకు ఇటీవలికాలంలో అవినీతి నిరోధక శాఖ పేరిట వస్తున్న బెదిరింపులేఖలు ఉత్తుత్తివేనని, వాటిని నమ్మవద్దని, మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘మీరు అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని, మీపై దాడులు నిర్వహించదలచామని, దాడులు జరగకూడదని భావిస్తే, మేము సూచించిన బ్యాంకు అకౌంట్‌లో కొంత నగదు డిపాజిట్ చేయాలని’ పేర్కొం టూ అధికారులకు ఏసిబి పేరిట ఉత్తరాలు వచ్చాయని, ఇది తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఇలాంటి నకిలీ ఉత్తరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాడులు జరగకుండా చూడాలంటే, డబ్బు చెల్లించాలంటూ ఎస్‌బిహెచ్, డిఫెన్స్ కాలనీకి చెందిన నీలకంఠేశ్వర్ రెడ్డి చిరునామాతో వచ్చిన ఉత్తరాలను పరిశీలించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నీలకంఠేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్టు ఏసిబి డైరెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ ఏసిబి అధికారుల పేరుతో వచ్చే ఉత్తరాలు, ఉత్తర్వుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఉత్తరాలు వచ్చిన వెంటనే స్థానిక పోలీసులకు గానీ ఏసిబి అధికారులకు టోల్ ఫ్రీ నెం. 1064కు ఫోన్ చేయాలని డైరెక్టర్ సూచించారు. అవినీతిపరులపై ఫిర్యాదు చేయదలచిన వారు 040-23251558, 040- 23251551లకు ఫోన్ చేయవచ్చని ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచబడుతాయని ఏసిబి డైరెక్టర్ పేర్కొన్నారు.