అక్షరాలోచన

ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొటీన్.. రొటీన్.. రొటీన్...
ఎవరికి మాత్రం పుట్టదు విసుగు...
అవి సినిమాలైనా.. జీవితాలైనా..
‘నూతనత్వం’ కోసం వెదుకులాటే
మనిషిని రాతియుగం నుండి
రాకెట్ యుగానికి తీసుకొచ్చింది కాదా..?!
చూసి చూసి... బోర్ కొడుతుంటే
‘మగధీర’ వచ్చి మత్తెక్కించలేదూ...
‘బాహుబలి’ భళా.. అనిపించలేదూ...
వెరైటీలో వున్న కిక్కే అదబ్బా...
లలిత కళలన్నీ అలా పుట్టినవే కదూ...
ఆ ‘కళ’లే కాదు.. బతుకు ‘కల’లకూ ఇదే స్ఫూర్తి...
ఈ జిజ్ఞాసే కదూ.. తర్కానికి ఆధారం
అనే్వషణకు మూలం.. ఇదే కదూ...
ఇంత అభివృద్ధికీ.. ఆయువు పట్టు ఇదేనబ్బా...
ఐతే... గుర్తుంచుకో
‘కాలం’ చక్రభ్రమణ స్వభావి...
కొన్నాళ్లకి.. ఈ వెరైటీల వెదుకులాటా
బోర్‌కొట్టే తీరుతుంది...
అప్పుడే పుడుతుంది... అసలైన ఆలోచన
ఈ సృష్టిలో.. సమస్తమూ..
అనిత్యము.. అశాశ్వతమేనని..
ఇవన్నీ.. కేవలం వట్టి భ్రమలేనని...
అలా కాకుంటే ఆ పరమాత్మకు కూడా
బోర్ కొడుతుంది కదూ...
అందుకే.. నిత్యుడైన ఆ పరమాత్మ కూడా
ఈ అనిత్య సృష్టిలోనే ఆనందాన్ని పొందుతున్నాడు...!
*

-సత్యానే్వషి 7981327110