అదిలాబాద్

కరెంట్ షాక్‌తో తల్లీకొడుకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరమెరి, అక్టోబర్ 4: విద్యుత్‌ఘాతంతో తల్లీకొడుకులు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కేలి(బి) గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన కథనం ప్రకారం కేలి(బి) గ్రామానికి చెందిన కొట్రంగె గౌరుభాయి (60), కొట్రంగె భీమ్‌సేన్ (30) సోమవారం గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలంలో పత్తి పంటకు పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లారు. పొలం పక్కనే ఉన్న నీటి గుంట నుంచి నీటిని తీసుకువచ్చేందుకు గౌరుభాయి వెళ్లింది. గౌరు భాయి పొలం పక్కనే ఉన్న పొలం యజమాని కాశీనాథ్ అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. విద్యుత్ లైన్ తీగ తెగి నీటికుంట పక్కన ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌కు తగలడంతో ఫెన్సింగ్‌కు విద్యుత్ సరఫరా అయింది. గమనించని గౌరుభాయి నీళ్లు తెచ్చే క్రమంలో ఫెన్సింగ్ లైన్‌కు చేయి తగిలి విద్యుత్‌ఘాతంతో అక్కడికక్కడే మృతిచెందింది. తన తల్లి గౌరుభాయి నీళ్ల కోసం వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో భీమ్‌సేన్ వెతుకుతూ నీటి కుంట వద్దకు వచ్చాడు. తల్లి విద్యుత్‌ఘాతానికి గురైన విషయం తెలియని భీమ్‌సేన్ పరిశీలించే క్రమంలో అతను కూడా విద్యుత్‌ఘాతానికి గురై మరణించాడు. తల్లీకొడుకులు ఇంటికి సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి వెళ్లి పొలం చుట్టు గాలించగా నీటి కుంట వద్ద విద్యుత్‌ఘాతానికి తల్లీకొడుకులు మృతిచెంది ఉన్నారు. మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. వాంకిడి సిఐ ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుడు భీమ్‌సేన్ భార్య శ్యామలాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ముగ్గురు కుమారులున్నారు. తల్లీకొడుకుల మృతితో కేలి(బి) గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటికి పెద్ద దిక్కయిన భీమ్‌సేన్ మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.