అదిలాబాద్

జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ రూరల్, అక్టోబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనలో ఆసిఫాబాద్‌ను కుంరంభీం జిల్లాగా ఏర్పాటు చేసిన సీ ఎం కేసీ ఆర్ అండదండలతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. నార్నూర్ మండలానికి చెందిన జడ్పీటీసీ రూపావతిపుష్ప, ఎంపిపి గోవింద్, అన్ని జిల్లాల్లోని ఈజీ ఎస్ ఏపీ ఎంలు ఎమ్మెల్యే కోవ లక్ష్మిని శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. వాంకిడి ఎంపిటిసి నాగేశ్వర్ రావు, నాయకులు జీవన్, సదాశివ్, నార్నూర్ ఎంపిటిసిలు పాండురంగ్, గౌతమ్, సర్పంచ్ ఆత్రం జగ్గారావు, రాము, హన్మంతు తదితరులున్నారు.

డిస్మిస్డ్ కార్మికులకు ఉద్యోగాలివ్వాలి
* విప్ నల్లాల ఓదెలుకు వినతి
మందమర్రి, అక్టోబర్ 13: సింగరేణిలో పనిచేస్తూ గైర్హాజరు కింద తొలగించబడిన డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ డిస్మిస్ కార్మికులు గురువారం ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలుకు వినతి పత్రం అందించారు. సింగరేణిలో కొన్ని సంవత్సరాలు పనిచేస్తూ తమను గైర్హాజరు కింద తొలగించడం జరిగిందని, తమకు న్యాయం చేయాలని డిస్మిస్ కార్మికులు ప్రభుత్వ విప్‌కు విన్నవించారు. వారసత్వ ఉద్యోగ హక్కు, డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన మాదిరిగానే తమకు కూడా న్యాయం చేయాలని వారు ప్రభుత్వ విప్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా నల్లాల ఓదెలు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగిందని, త్వరలో డిస్మిస్, వీఆర్‌ఎస్ కార్మికులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. డిస్మిస్ కార్మికులు అధైర్యపడవద్దని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిస్మిస్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్, నాయకులు సమ్మయ్య, ఓదెలు, తిరుపతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

గాడిలో పడని పాలన
* అందుబాటులో లేని అధికారులు
ఆసిఫాబాద్, అక్టోబర్ 13: నూతనంగా ఏర్పాటైన కుంరం భీం జిల్లాలో ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడలేదు. దసరానాడు ప్రారంభమైన ఈ జిల్లా కేంద్రంలో 65 శాఖల జిల్లా కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. తొలిరోజునే కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డిఆర్‌ఓలతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఎవరు, ఎంతమంది అనే దానిపై స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా జిల్లా కేంద్రంలో ఏర్పాటైన కార్యాలయాల పూర్తి వివరాలు, కేటాయించిన సిబ్బంది జాబితాను వెంటనే తెలియచేయాలంటూ అన్ని ప్రభుత్వ ఆఫీసులకు కలెక్టరేట్ నుండి ఆదేశాలు జారీఅయ్యాయి. కొన్ని శాఖలకు సంబందించిన వివరాలు మాత్రమే గురువారం సాయంత్రం వరకు కలెక్టరేట్‌కు చేరినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని 65 శాఖల వివరాలు తెలియాలంటే ఇంకొంత సమయం తీసుకోవచ్చని తెలుస్తోంది. జిల్లా కార్యాలయాల్లో సామగ్రి కొరత తీరాలంటే కనీసం వారంరోజులు పట్టవచ్చు. కొన్ని కార్యాలయాలకు కంప్యూటర్లు కూడా రాలేదు. ఈ పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం ఏర్పడ్డ కుంరం భీం జిల్లా ప్రభుత్వ కార్యాలయాల పాలన గాడిలో పడాలంటే కనీసం పక్షంరోజులైనా తీసుకునే అవకాశంలేకపోలేదు. మరోవైపుకొన్ని జిల్లా కార్యాలయాల్లో ఇంకా మరమ్మత్తు పనులు జరుగుతూనే ఉన్నాయి. పరిపాలనలో కీలకమైన కలెక్టర్, ఎస్పీలు గురువారం అందుబాటులో లేకపోవడంతో ఆ శాఖల కార్యాలయాలు జనం లేక బోసిపోయి కనిపించాయి. పరిపాలనాధికారి లేక కొంత మంది వెనుతిరగగా, ఒకరిద్దరు కలెక్టరేట్‌లో ఆర్జీలు సమర్పించారు. అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బంది కార్యాలయాల కూర్పుకే పరిమితమయ్యారు.

మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేయాలి
* డిఈవో రఫీక్
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబర్ 13: మధాహ్న భోజనాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిఈవో రఫీక్ అన్నారు. గురువారం డిఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. వారానికి మూడు రోజులు గుడ్లు పెట్టాలని, ప్రతీ విద్యార్థికి సరైన సమయంలో అందించాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులు సరైన విద్యను అందించాలని, ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని, హాజరు కాని ఉపాద్యాయులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు సంతో ష్, మల్లయ్య, సూర్యప్రకాష్, సోమయ్య, వెంకటేశ్వర స్వామి, భిక్షపతి, నారాయణ, సుధాకర్, భరత్ చంద్ర, మోహన్ కుమార్ పాల్గొన్నారు.

లక్ష్యంలోగా మిషన్ భగీరథ పూర్తి
* ఎల్లంపల్లితో 5.5 లక్షల మందికి తాగునీరు
* పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి
* మంచిర్యాల కలెక్టర్ కర్ణన్
మంచిర్యాల, అక్టోబర్ 13: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసి నిర్దేశిత జూన్ 2017లోగా అందించాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ ఆదేశించారు. గురువారం ఏసిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రతీ ఇంటికి నల్ల ద్వారా తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, దీన్ని దృష్టి లో పెట్టుకొని అధికారులు నిర్దేశిత గడు వులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రధానంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లోని 337నివాసిత గృహా లు, మంచిర్యాల, మందమర్రి పట్టణంలోని దాదాపు 5.5లక్షల మందికి తాగునీరు అందుతుందని, అలాగే కుమ్రం భీం ప్రాజెక్టు ద్వారా బెల్లంపల్లి డివిజన్, కడెం ప్రాజెక్టు ద్వారా జన్నారం మండలంలోని కొన్ని గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం వివరాలను ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ప్రసాదరెడ్డి, ఈఈ మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. వివిధ సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై రెవెన్యూ, నీటి పారుదల అధికారులతో సమీక్షించిప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు లబ్దిచేకూర్చే విధంగా భూ సేకరణ పూర్తిచేయాలని, భూమి కోల్పో యే బాధితులకు ప్రాజెక్టు నిర్వహణ వల్ల ఉపయోగాలను వివరించివారికి అందే నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుధాకర్‌రావు, ఇంచా ర్జి డిఆర్‌వో ఆయిషా మస్రత్ ఖానం, బెల్లంపల్లి ఆర్డీవో పాండురంగారావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ప్రసాదరెడ్డి, ఈఈ మల్లేశం, సిపివో సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన సేవలు
* అధికారులకు మంచిర్యాల కలెక్టర్ సూచన
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 13: రోగులకు మెరుగైన సేవలు అందించాలని మంచిర్యాల కలెక్టర్ కర్ణన్ వైద్యులకు సూచించారు. గురువారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆస్పత్రి సూపరింటెండెంట్ నీరజను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమర్జెన్సీ సేవలను పూర్తిస్థాయిలో రోగులకు అందించి మెరుగైన పరికరాలను అందుబాటులో ఉంచే విధంగా చూడాలన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సమాచారం తెలిసే విధంగా సంబంధిత సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ వార్డు, మందుల నిల్వ గది, వివిధ వ్యాధుల పరీక్ష గది, సురక్ష క్లినిక్, టిబి గది, ఆరోగ్యశ్రీ వార్డు, శస్త్ర చికిత్సల అనంతరం రోగులను ఉంచే వార్డు, బ్లడ్ నిల్వ ఉంచే గది, ఆపరేషన్ థియేటర్ తదితర వార్డులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ భీష్మతో కలసి పరిశీలించారు. అలాగే రెడ్‌క్రాస్ సంస్థలో నిల్వ ఉన్న రక్తాన్ని మొదటగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు అందించాలని అన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ విరివిగా రక్తదాన శిభిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించాలన్నారు. మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధి నిర్దారణ పరీక్షలన్నింటికీ ఒక సమీకృత ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. టిబి రోగుల వివరాలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించి అక్కడి ఏ ఎన్ ఎంల ద్వారా తగు వైద్య సదుపాయం, మందులు అందేలా చూడాలన్నారు. హెచ్ ఐవి, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వైద్య సిబ్బంది రోగులు, రోగుల సంబంధీకులకు ఇబ్బందులు కలుగకుండా ఆస్పత్రిలో మరుగుదొడ్లు నిర్వహించాలన్నారు. త్వరలోనే ఈ ఆస్పత్రిని జిల్లా ప్రధాన ఆస్పత్రిగా ఏర్పాటు అవుతున్న సందర్బంగా ప్రజలకు మరింత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్య సిబ్బంది అంకిత భావంతో నిరంతరాయం అందుబాటులో ఉండి సేవ చేయాలన్నారు. గర్బిణీల కోసం మంచి పౌష్టికాహారం అందిస్తూ పుట్టబోయే బిడ్డ గూర్చి వారి తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పేలా రోగులకు ఎలాంటి అవస్థలు ఏర్పడకుండా తాగునీటిని శుభ్రపరిచే ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఐసియులోని పరికరాలు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నూతనంగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా మీ వంతుగా కృషి చేయాలన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులకు రెఫర్ చేసి వాటిని నెరవేర్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ భీష్మ, ఆస్పత్రి సూపరింటెండెంట్ నీరజ, సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి
* పథకాలు అర్హులకు అందేలా చూడాలి
* జిల్లాస్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి అల్లోల
నిర్మల్, అక్టోబర్ 13: నూతనంగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లాను అన్నిరంగాల్లో అబివృద్ధి చేసేందుకు ప్రభు త్వం అవసరమైన నిధులను మంజూరుచేస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులతో అభివృద్ది పనులు జరగాలంటే అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వపథకాలను అర్హులైన ప్రతీఒక్కరికి అందేలా చూడాలన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారన్నారు. దానికి అనుగుణంగా నిర్మల్ జిల్లాలో పనిచేయడానికి వచ్చిన అధికారులు, సిబ్బంది తప్పకుండా జిల్లా కేంద్రంలోనే ఉండి ప్రజలకు సేవచేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, ఇరిగేషన్, గృహనిర్మాణ, డ్వామా, ప్రజారోగ్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, తాగునీటి సరఫరా, ఆర్ అండ్‌బి, పంచాయతీరాజ్, మిషన్‌కాకతీయ, పరిశ్రమలు, తదితర శాఖల అధికారులతోపాటు ఇతర ముఖ్యశాఖల అధికారులంతా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అభివృద్ధి దిశగా ప్రణాళికలు సిద్దంచేసి పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ ఇల్లంబర్తి మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన అనుభవం అందరికి ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు పడకుండా అందరం కలిసి పనిచేసి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా చూద్దామన్నారు. అనంతరం ముఖ్యమైన శాఖల అధికారులు ఒక్కొక్కరుగా వచ్చి ఆయాశాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలను వివరించారు. సమావేశంలో పార్లమెంటు సభ్యుడు నగేష్, ఖానాపూర్, ముధోల్ శాసన సభ్యురాలు రేఖాశ్యాంనాయక్, విఠల్‌రెడ్డి, జెసి శివలింగయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.