అదిలాబాద్

ఓపెన్ కాస్టులపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న సింగరేణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి: నాలుగు జిల్లాల్లోని సింగరేణి వ్యాప్తంగా ప్రజల జీవనవిధానాన్ని అతలాకుతలం చేస్తున్న ఓపెన్‌కాస్టులపై సింగరేణి యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ విమర్శించారు. గురువారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఓపెన్ కాస్టులను ప్రజలు వ్యతిరేకిస్తున్నా సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్టులకు అనుమతులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లిని ఓపెన్ కాస్టు చేయాలని కుట్ర పన్నుతోందని తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు 90శాతం ప్రజలు ఓసిలకు వ్యతిరేకంగా ఉన్నారని, ఓసిలకు అనుమతులు ఇస్తే సిపిఐ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఓపెన్ కాస్టుల ఏర్పాటు వల్ల రైతుల సమస్యలు, ఇండ్లు కోల్పోయినవారి బాధలు, ధ్వంసమవుతున్న గ్రామాలు అంశాలపై చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కేకే-2 మెగా ఓసి ఏర్పాటు అంటూ యాజమాన్యం వ్యవహరించడం దారుణమన్నారు. భూములు కోల్పోతున్నవారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, నాలుగు రెట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి భూములకు, కట్టడాలకు హాని కలుగకుండా భూగర్బ గనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సింగరేణి సిఅండ్‌ఎండి ముఖ్యమంత్రికి విన్నవించామని తెలిపారు. ప్రజా సమస్యలపై అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌కు మందమర్రి ఏరియా జిఎం బెల్లంపల్లిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దని లేఖ రాయడం గర్హనీయమన్నారు. ఈ సమావేశంలో సిపి ఐ నాయకులు వెంకటస్వామి, మల్లయ్య, మాణిక్యం, నగేష్, లక్ష్మణ్, పుల్లూరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.