అదిలాబాద్

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 17: ఆదిలాబాద్ జిల్లాలో విద్య,వైద్య రంగం ఎంతో వెనకబడి ఉందని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలుపర్చడమే గాక విద్య, వైద్యరంగంపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి జిల్లాను అభివృద్దిపథంలో తీసుకువెళ్ళాలని కలెక్టర్ బుద్ధప్రకాష్ సూచించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన తొలిసారిగా ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు ఫోన్‌ద్వారా వారి సమస్యలను నేరుగా కలెక్టర్‌కు వివరించారు. ఇంద్రవెల్లి గ్రామానికి ఎందిన ఎం.సురేష్ రెండు పడకగదుల ఇళ్ళు నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా తన పేరు జాబితాలో రాలేదని, తనకు న్యాయం చేయాలని కోరాడు. అదేవిధంగా పలువురి సమస్యలను ఎంతో ఓపిగ్గా విని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా పలువురు ఆర్జీదారులు వారి వారి సమస్యలతో దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జ్యోతి బుద్దప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించారు. ప్రతి శాఖ అధికారి ప్రభుత్వం సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందించేలక్ష్యంతో జవాబుదారితనంతో పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి సందర్శనలు చేపట్టి ప్రభుత్వ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి లబ్దిచేకూర్చాలని, వారంలో ఒకరోజు గ్రామాలను సందర్శించి మండల అధికారులతో ఆయా శాఖల ప్రగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. అధికారులు తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించి ఆయా శాఖల కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకొని వారికి సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజావాణి దరఖాస్తుల నమూనను నూతన విధానం ద్వారా తయారు చేసి సంక్షేమ పథకాలు ఏవిధంగా పొందాలో అవగాహన కల్పించే విధంగా ప్రజావాణి దరఖాస్తు ఫార్మెట్ తయారు చేయాలని డిఐవో రాకేష్‌ని ఆదేశించారు. సమావేశంలో జెసి కృష్ణారెడ్డి, శిక్షణ కలెక్టర్ జయంతి అనురాగ్, జడ్పీ సిఈవో జితేందర్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి రాజేశ్వర్ రాథోడ్, సిపివో కేశవ్‌రావు, డిపివో పోచయ్య, స్ట్ఫె సిఈవో వెంకటేశ్వర్లు, మహిళా వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిని ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్ మంగతయారు, వ్యవసాయ శాఖ జెడి అశాకుమారి, కలెక్టరేట్ ఏవోసంజయ్‌కుమార్, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.