అదిలాబాద్

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 17: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సత్వరమే సమస్యలను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్‌వి కరుణన్ అన్నారు. నూతనంగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో మొదటిసారిగా ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించగా, ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. అర్జీ దారుల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కారానికి సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో వారికున్న సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజాఫిర్యాదుల కార్యక్రమానికి వస్తున్నారని, వారి ఆశలను నెరవేర్చే విధంగా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని హమాలి వాడకు చెందిన కట్కాసుల రమ తనకు ఎలాంటి ఆధారం లేదని, వికలాంగుల ఫించన్ కూడా రావడం లేదని ఆదుకోవాలని ఫిర్యాదు చేయగా, వెంటనే సంక్షేమ శాఖ ద్వారా మూడు చక్రాల సైకిల్‌ను కలెక్టర్ ఉచితంగా అందజేశారు. సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా సదరన్ క్యాంపు సర్ట్ఫికేట్ తీసుకువచ్చిన వెంటనే వికలాంగులకు ఫించన్ అందిస్తామని అన్నారు. అంత్యోదయ, అన్నయోజన పథకం ద్వారా 35కిలోల బియ్యం మంజూరు చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారిణి ఆదేశించారు. మంచిర్యాల జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులు దాదాపు 5వేల మంది ఉన్నారని, వారికి రక్తం అందించడానికి పరీక్షలకు జిల్లాలోని ఆస్పత్రుల్లో ఎక్కడా యంత్రాలు అందుబాటులో లేవని, మంచిర్యాల ప్రాంతీయ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని తలసేమియా వ్యాధిగ్రస్తులు కోరారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా జనరల్ స్టోర్ ఏర్పాటుకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాని, ఇప్పటి వరకు కూడా సబ్సిడీ రాలేదని, త్వరలోనే ఇప్పించాలని మందమర్రికి చెందిన విజయ్‌కుమార్ కోరారు. నా భూమిలో కొంత భాగం చెరువు కాల్వ నిర్మాణంలో పోయిందని, ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని, పరిహారం అందించాలని జైపూర్ మండలం ఖాజిపెల్లి గ్రామానికి చెందిన రైతు సంగె కిష్టయ్య ఫిర్యాదు చేశారు. చెన్నూర్ మండలం సుందరశాల గ్రామంలో ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమిని తన కూతురు, అల్లుడు కలసి అక్రమంగా నాకు తెలియకుండా వారి పేరుమీద రాయించుకున్నారని, నా భూమిని నాకు అందించాలని, నా పేరుమీద చేయాలని వేంపల్లికి చెందిన ఇద్దిరాజు శాంత కలెక్టర్‌కు విన్నవించారు. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపుకు గురైన నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం అందించాలని ఆయా గ్రామాల నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సుదాకర్ రావు, ఇంచార్జి డీ ఆర్‌వో ఆయిషా మస్రత్‌ఖానం, సిపివో సత్యనారాయణ రెడ్డి, డీ ఆర్‌డీవో వెంకట్, సంక్షేమాధికారి రావూఫ్‌ఖాన్, బిసి వెల్ఫేర్ అధికారి ఖాజానజీమ్ అలీ అఫ్సర్, జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి ప్రేందాస్, జిల్లా వైద్యాధికారి విష్ణు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, కలెక్టర్ ఏవో రాజేశ్వర్, అసిస్టెంట్ డైరెక్టర్, ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, జిల్లా పరిషత్ డిప్యూటీ సీ ఈవో నరేందర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.