అదిలాబాద్

వేసవిలో తాగునీటి ఎద్దడిపై ఏమరుపాటు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: మార్చిమాసంలోనే ఎండలు మండిపోయి భూగర్భ జలాలు అడుగంటుతూ తాగునీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారని, నీటి ఎద్దడిని నివారించేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ అధికార్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో నియోజకవర్గంల్లో తాగునీటి వనరులపై సమీక్షించారు. ఈ సందర్భంగా తాగునీటి ఎద్దడి గ్రామాల వివరాలు, నిరోదించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మండలాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి రామన్న మాట్లాడుతూ నీటిఎద్దడి గల గ్రామాల్లో మంచి నీటి బోరుబావులను వేయించడంతో పాటు బోర్‌వెల్స్‌లకు మరమ్మత్తులు చేయించాలన్నారు. పంచాయతీల ద్వారా మరమ్మతులకు తీసుకునే మెటిరియల్ నాణ్యమైనదిగా ఉండేలా చూడాలన్నారు. నీరు సరిపోకపోతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, అవసరమైనచోట ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాగులు, చెరువుల నుండి పైపులైన్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించుకోవాలని, సోలార్ పంపు సిస్టమ్ ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న బోర్‌బావుల్లోని నీటిని ప్రజలు వాడుకునేలా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనమతులు త్వరగా ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు. తాగునీటి కొరకు గ్రామజ్యోతితో ప్రణాళిక రూపొందికున్నామని, ఆ ప్రకారంగా కుదరకపోతే పంచాయతీ తీర్మానం తీసుకొని పనులు చేసుకోవాలన్నారు. బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు మాట్లాడుతూ గిరిజన తండాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, నాలుల నెలల క్రితం నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గ్రామపంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చొని మాట్లాడుకుంటే ప్రణాళిక ప్రకారం సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ మూర్తి, తహశీల్దార్లు, ఎంపిడీవోలు, జడ్పీటీసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.