అదిలాబాద్

జూన్ నుంచి బిసి గురుకుల పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం జూన్ నుండి వెనకబడిన తరగతుల విద్యార్థుల కోసం ఉన్నత ప్రమాణాలతో కూడిన గురుకుల పాఠశాలలను ప్రారంభించనుందని, విద్యార్థుల్లో ఉన్నత విద్యాప్రమాణాలు నెలకొల్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ కేంద్రంలోని రాంనగర్, పిట్టల్‌వాడ బాలుర, బాలికల గురుకుల పాఠశాలలను, మైనార్టీ గురుకుల పాఠశాలను మంత్రి రామన్న ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న బోధన, భోజన వసతులపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. అయితే పిట్టల్‌వాడలో బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినా పాఠశాలకు వెళ్లే రహదారి అస్థవ్యస్తంగా ఉందని, రోడ్డు సౌకర్యం కల్పించాల్సిందిగా ఉపాధ్యాయులు మంత్రికి విన్నవించారు. వెంటనే అక్కడ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమం, వారి అభివృద్ది కోసం నాణ్యత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచిగా పనిచేస్తాయని, ఉపాధ్యాయులు అంకితభావంతో సేవలందించి గురుకుల పాఠశాలల ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళికతో మైనార్టీ, బిసి, ఎస్సీ, ఎస్టీల కోసం అన్ని నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలలను నెలకొల్పుతున్నారని, వాటి పనితీరు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. మెను ప్రకారం భోజన వసతి అందించడంతో పాటు అల్పాహారం పౌష్టికాహారంతో కూడినవిధంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కెటిటుపిజి విద్యలో భాగంగానే ఒక విద్యార్థికి రూ.80వేల చొప్పున ప్రభుత్వం ద్వారా ఖర్చుచేసి నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు సైతం కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అదిరోహించాలన్నారు. వచ్చే జూన్ నుండి బిసి విద్యార్థులకు కూడా తెలంగాణ పేద వర్గాల విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ప్రారంభం కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మావల తహసీల్దార్ భోజన్న, మండల అభివృద్ది అధికారి రవీందర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నదీముల్లాఖాన్, సర్పంచ్ ఉష్కం రఘుపతి, జడ్పీటీసీ విజ్జగిరి అశోక్, ఉపాధ్యక్షులు గంగారెడ్డి, పట్టణ అధ్యక్షులు సాజిదోద్దిన్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె.రాజన్న, టీఆర్‌ఎస్ నాయకులు అడ్డి బోజారెడ్డి, కౌన్సిలర్లు, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.