అదిలాబాద్

పథకాలను పకడ్భందీగా అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, అక్టోబర్ 20: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అమలవుతున్న పథకాలన్నీంటిలో వందశాతం ఫలితాలు సాధించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబర్తి అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్‌డిఎ, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో స్వచ్చ్భారత్, బ్యాంక్ లింకేజీ, స్ర్తినిధి, డైరీ, సోషల్ సెక్యూరిటీ, ఈజియంయు, ఎల్‌పిడి, ఆసరా పింఛన్లు, హెచ్‌ఆర్ తదితర అంశాలపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. స్వచ్చ్భారత్ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. ఇందులో ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఎన్ని పూర్తయినవి ఉన్నాయని, పూర్తికాని వాటికి బిల్లులు వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించారు. మండలాలవారీగా మరుగుదొడ్ల నిర్మాణాలు, బిల్లుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల అధికారులతో సంక్షేమ పథకాల పూర్తివివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ దేవేంధర్‌రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ చరణ్‌దాస్, ఎపిఓ, ఎపిడి, ఎఈ, ఎఎన్‌ఎం తదితరులు పాల్గొన్నారు.

కళాశాలల్లో విద్యాప్రమాణాలు నెలకొల్పాలి
* డిఐఈవోను సన్మానించిన అధ్యాపకులు
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 20: కళాశాలల్లో విద్యాప్రమాణాలు నెలకొల్పి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి నాగేందర్ అన్నారు. గురువారం కొత్తగా విధుల్లో చేరిన డిఐఈవో నాగేందర్‌ను ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఐఈవో మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధనతో పాటు ఫలితాలు రాబట్టేవిధంగా సమష్టిగా పాటుపడాలని సూచించారు. లెక్చరర్లకు పూర్తిసహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిఐఈవోను సన్మానించిన వారిలో టిఎస్‌జిసిసిఏ (475) సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్, గాజుల శ్రీనివాస్, సూర్యకాంత్, కె.పి సాగర్, దేవిచంద్, జ్ఞానేశ్వర్, లింగన్న, దేవేందర్, అవోక్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సేవల్లో పోలీసులు ముందుండాలి
* జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 20: ప్రజల రక్షణతో పాటు సామాజిక సేవల్లో జిల్లా పోలీసులు ముందుండాలని జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా పోలీసుల అధ్వర్యంలో మెగా రాక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ పాల్గొని మాట్లాడారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సామాజిక సేవల్లో జిల్లా పోలీసులు పాల్గొంటున్నారని అనానరు. సాయుధ బలగాలు 60 మందితో పాటు స్వచ్చందంగా 100 మంది పట్టణ యువకులు రక్తదానం చేసి స్థానిక రిమ్స్ ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంకుకు తరలించడం జరిగిందన్నారు. రక్తదానం చేయడంలో యువత ముందుండాలని ఎస్పీ పిలుపునిచ్చారు. దేశ భద్రతకు ఎంతో మంది సైనికులు సరిహద్దు వెంట విధులు నిర్వహిస్తున్నారని, శాంతి భద్రతలను పరిరక్షించుటకు జిల్లా పోలీసులు ఆహార్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో యువకులైన ఎస్సైల ప్రోత్సహంతో పోలీసు శాఖలో చేరడానికి యువత ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో ఆదిలబాద్ టూటౌన్ ఎస్సై జి.రాజన్న, మావల ఎస్సై ఎల్.రాజ్‌తో పాటు 60 మంది సాయుధ పోలీసులు రక్తదానం చేశారు.
అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి కృషి
పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీసులు పూర్తిబాధ్యత వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా పోలీసు అమరవీరుల కుటుంబాల కాలనీ ఏర్పడిందన్నారు. వారి సంక్షేమానికి ఎళ్లవేళలా ఎన్ ఐబి అధికారులు అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డిఎస్పీలు ఎ.లక్ష్మీనారాయణ, బుర్హాన్ అలీ, కె.సీతారాములు, ఆర్ ఐబి జెమ్స్, సిఐలు ఎన్.సత్యనారాయణ, వెంకటస్వామి, యండి షేర్ అలీ, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు బాల శంకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం సేకరణ సమర్థవంతంగా నిర్వహించాలి
* జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి
మంచిర్యాల, అక్టోబర్ 20: ఖరీఫ్ సీజన్‌లో ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు దాన్యం సేకరణ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా సహాకార అధికారి సంజీవరెడ్డి అన్నారు. గురువారం జిల్లా సహాకార భవన్‌లో సహాకార సంఘాలతో దాన్యం సేకరణ సంఘాల సీవోలతో సమావేశం ఏర్పాటు చేసి దాన్యంపై సాంకేతిక శిక్షణ, తేమ కొలిచే యంత్రాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మార్కెటింగ్ శాఖ మేనేజర్ రాజయ్య హాజరై వాటిపై వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో 46(ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు) దాన్య సేకరణ కేంద్రాలు, 8 జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సంఘాలు, మొత్తం 54 సెంటర్లను ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. నాణ్యమైన సరుకులను తీసుకొని 48గంటల్లో రైతులకు చెల్లింపులు జరుగాలని తెలిపారు. అనంతరం సివిల్ సప్లై అధికారి రాజేందర్ కుమార్ మాట్లాడుతూ ప్యాడీ సెంటర్ ఈ అకౌంటింగ్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు జరుపాలని అన్నారు. ప్రతీ కేంద్రంలో ఇంచార్జి పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. దాన్యంలో తేమ శాతం 17శాతానికి మించకుండా ఉండాలని సూచించారు. రైతులు దాన్యం ఆరబెట్టి నాణ్యమైన దాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ఏ గ్రేడ్ ద్వారా రూ.1510, సాదారణ రకం దాన్యానికి రూ.1470 గిట్టుబాటు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి ఉపేందర్, సంఘాల సీ ఈవోలు, కేంద్ర ఇంచార్జిలు, సహాకార సంఘం అధికారులు అనిల్ కుమార్, రవికిశోర్, తారామణి, రవీందర్‌లు పాల్గొన్నారు.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలుశిక్ష

ఆదిలాబాద్, అక్టోబర్ 20: తాంసి మండలం మందపల్లి గ్రామంలో గత మార్చి 20 తేదీన మైనర్ బాలికను భయబ్రాంతులకు గురిచేసి అత్యాచారం జరిపిన సంఘటనలో మహారాష్టక్రు చెందిన టేకం నాగోరావుకు పదేళ్ల కఠినకారగార శిక్ష, రూ.5వేల జరిమాన విధిస్తూ గురువారం జిల్లా అదనపు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే యవత్‌మాల్ జిల్లా పర్సోడి గ్రామానికి చెందిన టేకం నాగోరావు మైనర్ బాలికను తమ బంధువుల పెళ్ళికని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకవెళ్ళి నాలుగు రోజులు నిర్బంధంలో ఉంచి అత్యాచారం జరిపినట్లు తాంసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు గావించారు. ఏపిపి ఎం.రమణరెడ్డి కోర్టులో ముగ్గురు సాక్షులను హాజరుపర్చగా నేరం రుజువుకావడంతో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులపై వివిధ సెక్షన్ల కింద పదేళ్ల కఠిన కారగార శిక్ష, రూ.5వేల జరిమాన విధిస్తూ తీర్పునివ్వగా నేరస్తున్ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

మరుగుదొడ్ల బిల్లులను త్వరితగతిన చెల్లించాలి
* నిర్మాణ పనులను ఆన్‌లైన్‌లో ఉంచాలి
* కలెక్టర్ ఇలంబరిది
నిర్మల్, అక్టోబర్ 20: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులను త్వరితగతిన అధికారులు చెల్లించాలని నిర్మల్ కలెక్టర్ ఇలంబర్తి ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను వెంటదివెంట ఎంపిడివొలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఈలు ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. జిల్లాలో మిషన్‌భగీరథ పనులను త్వరితగతిన చేపట్టాలని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాల్సినఅవసరం ఉందన్నారు. ప్రపంచబ్యాంకు నిధులు, జాతీయ గ్రామీణ నీటిపథకం, సిఆర్‌ఎఫ్, నాన్ సిఆర్‌ఎఫ్, నియోజకవర్గ అభివృద్ధి నిధుల పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ముధోల్, గాంధీనగర్, ఖానాపూర్‌లలో మూడు సిపిడబ్ల్యూఎస్ పథకాలు నడుస్తున్నాయని, వీటి నిర్వణ ఖర్చులకుగాను ఒక కోటి 66 లక్షలు అవసరం ఉన్నాయని, రక్షిత మంచినీటి పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్‌రెడ్డి కలెక్టర్‌కు నివేదించారు. జిల్లాలో 674 హ్యాబిటేషన్లు, 240 పంచాయతీలలో 1036 రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరాచేస్తున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో రక్షిత మంచినీటి పథకం ఈఈ దేవెంధర్‌రెడ్డి, డిఈ కట్ట శ్రీనివాస్, ఎఈ తదితరులు ఉన్నారు.

పకడ్బందీగా పంట కొనుగోళ్లు
* పత్తిలో తేమశాతం నిర్దారణకు రైతు వద్దకే పరికరాలు
* మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీచేసిన కలెక్టర్ బుద్ద ప్రకాష్

ఆదిలాబాద్, అక్టోబర్ 20: మార్కెట్ యార్డుల్లో రైతులు తీసుకువచ్చే పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించి, దళారుల బెడద లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టి రైతుకు న్యాయం చేకూర్చాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. గురువారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి త్వరలో ప్రారంభించే పత్తి, సోయాబీన్, పప్పు దినుసుల పంట కొనుగోళ్లు, వౌలిక వసతుల గురించి ఆరా తీశారు. రైతులకు కనీస మద్దతు ధరతో కొనుగోళ్లు జరిగే విధంగా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ టెండర్ జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రైతులందరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మార్కెటింగ్ అధికారులపై ఉందన్నారు. మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా పంట కొనుగోళ్లు చేపట్టాలని, ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం మార్కెట్ యార్డుల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, నాసిరకం పనులు సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మార్కెట్‌యార్డుల్లో అవసరమైనన్ని ఎలక్ట్రానిక్ కాంటాలు, మాయిచర్ మిషన్లు అందుబాటులో ఉంచాలన్నారు. మార్కె యార్డులకు పత్తిని తెచ్చిన తరువాత తేమ శాతం ఎక్కువగా ఉందని తెలుసుకొని రైతులు ఆవేదన చెందకుండా ఉండడానికి రైతుల పొలాల వద్ద తేమశాతం తెలుసుకోవడానికి మాయిచర్ మిషన్లు గ్రామాల్లో ఏర్పాటు చేయాలని జిల్లా మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. మార్కెట్ యార్డులలో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, మార్కెట్ యార్డులలో పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కనీస మద్దతు ధర తగ్గకుండా కొనుగోళ్లు చేయాలని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ఆడెల్లుని ఆదేశించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె.రాజన్న మాట్లాడుతూ మార్కెట్‌యార్డులో అన్ని ఏర్పాట్లు సిద్దం చేశామని, అక్టోబర్ 24 నుండి సోయా కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అడెల్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 201617 సంవత్సరంలో పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,160 ప్రకటించడం జరిగిందన్నారు. రైతులు పండించిన పత్తిని 8శాతం తేమ మించకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. సోయాబీన్‌కు మద్దతు ధరలు పసుపుపచ్చ రూ.2,625, నలుపు రకం సోయాబీన్లకు రూ.2,625 నిర్ణయించడం జరిగిందన్నారు. అదే విధంగా కందులు క్వింటాలుకు రూ.4,625, బోనస్ రూ.425, మినుములు క్వింటాలుకు రూ.4,575, బోనస్ 425, పెసరి క్వింటాలుకు రూ.4,800, బోనస్ కింద రూ.425, వేరుశనగ క్వింటాలుకు రూ.4,575, సన్‌ప్లవర్ క్వింటాలుకు రూ.3,850, నువ్వులు క్వింటాలుకు రూ.4,800 చొప్పున ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి ఆర్.సంతోష్ కుమార్, మార్కెట్ యార్డు కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.