అదిలాబాద్

విధి నిర్వహణలో పోలీసుల సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 21: సమాజ రక్షణకోసం పోలీసులు, దేశభద్రత కోసం సైనికులు వీరోచితంగా పోరాడుతూ అసువులుబాసిన వారి త్యాగా లు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ఉదయగౌరి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆదిలాబాద్ పోలీసు పరేడ్ మైదానంలో అమరజవానుల స్మారక స్థూపంవద్ద జిల్లా న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్, కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, అదనపు ఎస్పీ పనసారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఉదయగౌరి మాట్లాడుతూ అమరుల త్యాగాలు నేటి తరం పోలీసులకు ఆత్మగౌరవాన్ని పెంచుతాయని, వారిఆశయాల సాధన కోసం అంకితభావంతో పోలీసులు సేవలందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో జాతి రక్షణ కోసం సైనికులు వీరోచితంగా పోరాడుతూ వారి జీవితాలను త్యాగం చేస్తున్నారని, సైనికుల సేవలకు జోహార్లు అర్పించాలన్నారు. సమాజరక్షణకోసం కుటుంబాలను దూరం చేసుకుంటూ దేశభక్తితో ముందుకు సాగుతున్న సైనికుల ధైర్యసాహసాలను జాతియావత్ కొనియాడుతోందన్నారు. జిల్లాలో విధినిర్వహణలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా ప్రోత్సహకాలను అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అమరవీరుల పోలీసు కుటుంబాల సభ్యుల సమస్యలు తన దృష్టికి తెచ్చినట్లయితే పరిష్కరిస్తానని అన్నారు. అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రాణత్యాగం చేసిన సైనికులు, పోలీసులు 438 మంది పేర్లను చదివి వినిపించారు. 1959 ఆక్టోబర్ 21 చైనా సైనికుల దాడి ఘటనలో ఎంతో మంది జవానులు అసువులు బాసారని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం జరుపుకొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని స్మరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో అసువులు బాసిన పోలీసులు ఎం.కోట్యానాయక్, ఎస్సై ఎం.లక్ష్మణ్, అశోక్, తాహెర్ ఆహ్మాద్, గోవర్ధన్, శంకర్, సయ్యద్ ఆమీరోద్దిన్, జానారావు, రాజేశ్వర్ పోలీసుల కుటుంబ సభ్యులను బహుమతులతో ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్భంగా వివిధ పాటశాలల విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ స్థాయిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీసులు పరేడ్ మైదానం నుండి ప్రధాన వీదుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, మార్కెట్‌యార్డ్ చైర్మెన్ ఆరె.రాజన్న, డిఎస్పీలు లక్ష్మీనారాయణ, సీతారాములు, సామాజిక కార్యకర్త దేవన్న, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.