అదిలాబాద్

ముస్లిం పర్సనల్ లా బోర్డులో కేంద్రం జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరమెరి, అక్టోబర్ 21: ఆల్ ఇండి యా ముస్లిం పర్సనల్ లా బోర్డులో కేంద్రం జోక్యం సరికాదని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవాల ని డిమాండ్‌చేస్తూ ముస్లిం పెద్దలు పెద్దఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మతపెద్దలు సయ్యద్ అబ్దుల్ ఫయా జ్, జడ్పీటీసీ అబ్దుల్ కలామ్ మాట్లాడుతూ ముస్లింపర్సనల్ లాకు సంబంధించిన షరియత్‌చట్టాల్లో సవరణ కోసం కేంద్రం జోక్యం చేసుకుంటే సహించే ప్రసక్తేలేదన్నారు. ఖురాన్ ప్రకారం తాము నడుస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం సంక్షేమాన్ని పట్టించుకోని పాలకులు ముస్లింల సంప్రదాయాలను కాలరాయాలని చూస్తే ఆందోళన చేస్తామన్నారు. మతపరమైన విషయాల్లో తలదూర్చ డంఏమాత్రం సరికాదన్నారు. ఇలాంటి చట్టాలు అమలుపర్చడం ద్వారా నేరా లు పెరిగే ఆస్కారం ఉంటుందన్నారు. కేంద్రం దాఖలుచేసిన అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మత పెద్దలు హైమద్ వౌలీసాబ్, ఇలియాస్ హైమద్, యుసుఫ్, ఇస్మాయిల్, రజాక్, ఖరీమ్, నవీన్ దేశ్‌ముఖ్ తదితరులు పాల్గొన్నారు.