అదిలాబాద్

అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, అక్టోబర్ 21: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీర పోలీసు కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఇచ్చోడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలో భాగంగా జరిగిన రక్తదాన శిబిరానికి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయాసంఘటనలో సంఘవిద్రోహ శక్తులతో హోరాహోరిగా పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి రావాల్సిన సౌకర్యాలన్నింటినీ అందజేస్తామని అన్నారు. ప్రజల సహకారంతోనే సమస్యలను సునయాసంగా పరిష్కరిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలతో పోలీసులు మరింత మమేకం అవుతున్నారని అన్నారు. జనమైత్రి ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, జనమైత్రిపై మరింత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువతరం సామాజిక కార్యక్రమాల్లో ముందుండి సత్పవర్తనతో ముందుకు సాగాలని, నేటిపరిస్థితుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగానూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందడుగులు వేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత భుజస్కందాలపై ఉందని, ఉన్నత చదువులు చదివి పైకి రావాలన్నారు. అనంతరం జిల్లాస్థాయిలో జరిగిన వ్యాసర రచన పోటీలో మొదటి స్థానం సాధించిన ఇచ్చోడ కస్తూర్బా గాంధీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని రంజన్నకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు డిఎస్పీ మల్లారెడ్డి, సిఐ కరుణాకర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, సిరికొండ మండలాలకు చెందిన ఎస్సైలు పాల్గొన్నారు.