అదిలాబాద్

బెల్లంపల్లి అభివృద్ధి కృషి చేస్తా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, అక్టోబర్ 23: బెల్లంపల్లి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ది పరిచేందుకు అన్నీ విధాల కృషి చేస్తానిని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి మున్సిపాలిటిలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 7 లక్షలతో ఐచర్ ట్రాక్టర్లను ఎంపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి జిల్లా కాలేదని ఆందోళన చెందవద్దని ఈ పట్టణాన్ని అన్నీ విధాల అభివృద్ది పరుస్తానని హామి ఇచ్చారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో నిధులు లేనందున ఇక్కడి నివాస స్థలాలలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, సింగరేణి సంస్థ సి అండ్ ఎండి చర్చించి ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా తయారు చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి యజమాయిషీ లేకుండా చేయాలని ఎంపిని ఆయన కోరారు. అనంతరం చైర్‌పర్సన్ సునీతరాణి మాట్లాడుతూ మున్సిపాలిటిలోని కాంటా ఏరియాలో షాపింగ్ కాంపెక్సు నిర్మించేందుకు ఎంపి కోటా కింద రూ.50 లక్షలు ఇవ్వాలని చైర్‌పర్సన్ కోరగా స్పందించిన ఎంపి రూ. 20 లక్షల తన కోటా కింద మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మెన్ నూనేటి సత్యనారాయణ, పార్టీ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, ఎంపిపి సుభాష్‌రావు, తాండూర్ జడ్పీటిసి సురేష్, కౌన్సిల్లర్లు ఏలిగెటి శ్రీనివాసు, సుదర్శన్, రాములు పాల్గొన్నారు.