అదిలాబాద్

వంతెన పనులను త్వరలో ప్రారంభిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ రూరల్: మండలంలోని మంజులాపూర్-తాంశ, సాకెర, సారంగాపూర్ మండలం ఆలూర్, గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి శుక్రవారం నీటిపారుదలశాఖ సిఇ భగవంతరావు క్షేత్ర పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వంతెనల నిర్మాణానికి రూ. 16 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వంతెనలు, చెక్‌డ్యాంల నిర్మాణానికి అనువైన అంశాలను పరిశీలించారు.సాంకేతిక అంశాలను మరింత లోతుగా ఆలోచించి త్వరలో టెండర్లను ఆహ్వానిస్తారని పేర్కోన్నారు. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలోనే పనులను ప్రారంభిస్తామని వివరించారు. ఆయన వెంట ఇఇ రమణారెడ్డి, డిఇ కృష్ణ, శ్రీనివాస్‌రావు, సర్పంచి శనిగరపు నరేశ్ తదితరులున్నారు.

బాసరలో భక్తుల సందడి
బాసర, మార్చి25: చదువుల తల్లి కొలువైన బాసర అమ్మవారి సన్నిధిలో శుక్రవారం భక్తుల కోలాహలం నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర నుండి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. విధియ శుభముహూర్తాన్ని పురస్కరించుకుని అమ్మవారి చుట్టు పక్కల ప్రాంతాల్లో సైతం వివాహాలు వేడుకగా జరిగాయి. భక్తులు తమ చిన్నారులకు అమ్మవారి అక్షరాభ్యాస మండపాల్లో ఆలయ అర్చకులచే ఘనంగా అక్షరస్వీకార పూజలు నిర్వహింపచేశారు. ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని భక్తులు, చిన్నారులు తమ మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారి అన్నదాన సత్రంలో భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. సాధారణ ప్రత్యేక అక్షరాభ్యాసాలు 570 జరిగాయని అధికారులు పేర్కొన్నారు. అక్షరస్వీకారాలు, ఆర్జిత సేవలతో ఆలయానికి 4 లక్షల 50 వేల ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు. సుమారు 15 వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.