అదిలాబాద్

ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,అక్టోబర్ 25: ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశిత గడవులోగా పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిపై సమీంచి, పలు సూచనలు జారీ చేశారు. ముందుగా లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిపై ఇ ఇ అమ్జద్ హుస్సేన్‌ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముంపుకు గురైన భూముల సర్వేను సక్రమంగా నిర్వహించి, రైతులకు నష్టం కల్గకుండా భూములు కొనుగోళ్ళు చేసి నష్టపరిహారం సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పట్టా భూములు, ప్రభుత్వ, అసైండ్ భూముల వివరాలు అందించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలు ప్రతి వారం అందించాలని ఎస్‌సిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనుల ప్రగతి వివరాలను రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారుల ద్వారా అడిగి తెలుసుకొని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రాజెక్టుల కింద ముంపుబాధిత రైతులకు నష్టపరిహారం నిధుల చెల్లింపులో జాప్యం వహించరాదన్నారు. అదే విధంగా జిల్లా స్తాయిలోని ప్రాజెక్టుల నిర్మాణ పనులపై యాక్షన్‌ప్లాన్ తయారు చేసి అందించాలని రెవెన్యూ, వ్యవసాయ, నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేసి రైతులకు సాగునీరందించేలా అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని వ్యవసాయ బావులు, ఎన్ని మోటారు బావులు ఉన్నాయో సర్వే చేసి వివరాలు అందించాలని భూగర్భజల శాఖ డిడిని ఆదేశించారు.