అదిలాబాద్

పేద విద్యార్థుల అభ్యున్నతే ప్రభుత్వ ద్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల: రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దపెల్లి ఎంపి బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీశ్రీనగర్‌లో నూతనంగా నిర్మించిన గిరిజన ఆశ్రమ పాఠశాలను, ఏటీడబ్ల్యువో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. కేజీటుపీజీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 70 మైనార్టీ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహాకారాలు అందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు.
పేదల కోసమే ఉచిత సేవా వాహనం
పేద ప్రజల సౌకర్యార్థం ఉచిత సేవ వాహనాలను ప్రభుత్వం 108 సిబ్బందికి అప్పగించి మెరుగైన వైద్య చికిత్సల కోసం వాహనాలను ఉపయోగించే విధంగా 108ను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. 108ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు వెంటనే స్థానిక ఆస్పత్రులకు చేరవేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్య సేవలు సరైన సమయానికి అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే విధంగా తొలి తెలంగాణ రాష్ట్రంలో పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుందర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, ఎంపిపి బేర సత్యనారాయణ, జడ్పీటీసీ ఆశలత, తహసిల్దార్ కాచబోయిన సురేష్, కౌన్సిలర్లు పడాల రామన్న, పులి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.