అదిలాబాద్

విద్యుత్తు ప్రాజెక్టులకు బొగ్గు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూర్: ప్రభుత్వం చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టులకు బొగ్గు ఎంతో అవసరం ఉందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్ అన్నారు. తాండూర్ మండలంలోని బెల్లంపల్లి ఓపెన్‌కాస్టు-2 ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేసి శిలఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిఎం మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి అయితేనే కరెంట్, కరెంట్ ఉంటేనే పరిశ్రమలకు మనుగడ, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు. చట్టాలను సింగరేణి గౌరవిస్తునే నూతన బొగ్గు గనులు ప్రారంభించి విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తికి సింగరేణి కృషి చేస్తున్నదన్నారు. బెల్లంపల్లి ఓపెన్‌కాస్టు-2 ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా పది లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి విద్యుత్తు ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. ఎన్నో సమస్యలు అధిగమించి ఓసిపి ప్రాజెక్టు కోసం 108 ఎకరాలు భూమిని సేకరించడం జరిగిందని, భూ నిర్వాసితులకు ప్రభుత్వం సూచించే విధంగా నష్టపరిహారం అందిస్తామన్నారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు వలన భూములు కోల్పోయిన రైతులు, ప్రజల త్యాగాలను సింగరేణి ఎప్పుడు మర్చిపోదన్నారు. ముంపుగ్రామాల ప్రజలకు పునరావాస గ్రామాల్లో రోడ్లు, మంచినీటి, విద్యుత్ సౌకర్యంతో పాటు వౌళిక సదుపాయలు కల్పించి గ్రామాలాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఓసిపి వలన ఎవరైనా భూములు కోల్పోతే భూమి పట్టా పుస్తకాలు తమ వద్దకు తీసుకు వస్తే న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. సింగరేణి సంస్థకు ఎవరికి నష్టం చేయాలని చూడదని, ప్రజా, కార్మిక సంక్షేమం కోసం ఎన్ని లక్షలైనా వ్యయం చేసేందుకు వెనుకాడదన్నారు. బంగారు తెలంగాణలో భాగంగా సింగరేణి సిఎండి శ్రీ్ధర్ నూతన బొగ్గు గనుల ప్రారంభానికి, కార్మిక సంక్షేమానికి, నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకై ఆహార్నిశలు కృషి చేస్తున్నరనీ కొనియాడారు. టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు నల్లగొండ సదాశివ్, ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ భూ నిర్వాసితులకు, స్థానిక యువతకు ఓపెన్‌కాస్టులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని కోరారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జిఎం కొండయ్య, ఏరియా ఇంజనీర్ రామారావు, ప్రాజెక్టు అధికారి దేవేందర్, పర్సనల్ మేనేజర్ సీతారాం, ప్రాజెక్టు మేనేజర్ రమేష్, డివైజిఎం (సివిల్) రామకృష్ణ, ఎస్టెట్ అధికారిణి వరలక్ష్మి, సంక్షేమాధికారి శ్రావణ్‌కుమార్, అటవీశాఖ ఎఫ్‌ఆర్‌వో వినయ్‌కుమార్ సాహు, నాయకులు శ్రీనివాసరావు, మంగిలాల్, సంపత్‌రావు, శేషు తదితరులు పాల్గొన్నారు.