అదిలాబాద్

ప్రజావాణి ఆర్జీలకు జవాబుదారితనంతో పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 7: ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో జిల్లా నలుమూలల నుండి వచ్చే ఆర్జీలకు జవాబుదారితనంతో పారదర్శకంగా పరిష్కారం లభించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెసి కృష్ణారెడ్డి అధ్యక్షతన డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రాం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 8 మంది ఆర్జీదారులు వారి సమస్యలను నేరుగా ఫోన్‌ద్వారా జెసికి విన్నవించారు. గుడిహత్నూర్ మండలం ముత్నూరు గ్రామానికి చెందిన పి.సదానంద్, ఎన్. ఆశన్నలు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ అధికారులు బిల్లులు చెల్లించలేదని, నిధులు వెంటనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా బేల గ్రామానికి చెందిన టి.సంజయ్ తన పట్ట్భామిని వేరేవారు ఆక్రమించుకొని గుడిసెలు వేశారని, వాటిని తొలగించి తన భూమి తనకు ఇప్పించాలని ఫిర్యాదు చేశాడు. ఉట్నూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బి.నాగన్న గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని కోరాడు. వీరి సమస్యలను ఓపిగ్గా విన్న జెసి కృష్ణారెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి తక్షణమే బిల్లుల చెల్లింపులు పూర్తిచేయాలని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారిని ఆదేశించారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా పలు గ్రామాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈసంధర్భంగా జెసి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా అధికారులు సైతం జవాబుదారితనంతో సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సి ఈవో జితేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి రాజేశ్వర్ రాథోడ్, జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, దళిత శాఖ ఇడి శంకర్, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి కిషన్, జిల్లా పరిశ్రమ శాఖ జి ఎం రాంకిషన్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుబ్బరాయుడు, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి ఉమాదేవి, తహసీల్దార్లు భోజన్న, ఇ.వర్ణ, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రభాకర్ స్వామి, సుశీల తదితరులు పాల్గొన్నారు.