అదిలాబాద్

జిల్లావ్యాప్తంగా పోలీసుల కార్డన్ సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 7: కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలోమొట్టమొదటి సారి జిల్లా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రధానపట్టణాలైన నిర్మల్, భైంసా, ఖానాపూర్, కుభీర్ తదితర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు అనుమానస్పద ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పెద్దసంఖ్యలో సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొనగా ఏలాంటి దృవీకరణపత్రాలు లేని 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుర్తింపుకార్డులు లేకుండా అనుమానాస్పదంగా కనిపించిన 31 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జరిగిన ఈ విస్తృత తనిఖీలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ తెలియజేశారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ పట్టణంలోని వై ఎస్ ఆర్ కాలనీలో, భైంసా పట్టణంలోని పలు కాలనీల్లో, ఖానాపూర్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించగా సరైన పత్రాలు లేని 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే, 31మంది అనుమానితులను అరెస్ట్‌చేసి విచారించగా వీరిలో కొందరు గంజాయి స్మగ్లర్లు, మట్కా నిర్వాహకులు, పలు కేసుల్లో అరెస్ట్ అయి తప్పించుకు తిరుగుతున్నవారు ఉన్నారన్నారు. భైంసా పోలీస్‌సర్కిల్ పరిధిలో వాహనాల తనిఖీని నిర్వహించగా ఓ వాహనంలో రూ. 6 లక్షల విలువైన అక్రమ కలపను పట్టుకున్నామన్నారు. పలు దాబా హోటళ్లలో తనిఖీలు చేపట్టి అక్రమంగా మద్యం అమ్ముతున్న యజమానులను అరెస్ట్‌చేశామని తెలిపారు. నిర్మల్‌లోని వై ఎస్ ఆర్ కాలనీలో ఇండ్లలో నిల్వ ఉంచిన అక్రమ కలపను, కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారన్నారు. ఇక్కడ కొందరి ఇళ్లల్లో వాహనాలకు సంబంధించిన విడి భాగాలు పెద్ద ఎత్తున దొరికాయని, వాటిపై కూడా విచారిస్తున్నామన్నారు.
నేరాల అదుపుకోసమే.....
జిల్లావ్యాప్తంగా నేరాలను అదుపుచేసేందుకే ఒకేసారి పెద్దఎత్తున తనిఖీలను నిర్వహించామని ఎస్పీ తెలిపారు. విస్తృతంగా వాహనాలను తనిఖీ చేయడం, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం వల్ల నేరాలు తగ్గుముఖం పడుతాయన్నారు. కొత్త వ్యక్తులు ఇళ్లు అద్దెకోసం వచ్చినప్పుడు వారి గుర్తింపు కార్డులను విధిగా పరిశీలించిన తర్వాతే ఇళ్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రాత్రి 10 తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అన్నిరకాల దుకాణాలు, హోటళ్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని సూచించారు. రాత్రిపూట వ్యాపార వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచితే నేరగాళ్లకు తమ పని సులువవుతుందని, దీనిని అరికట్టేందుకే దుకాణాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని సూచిస్తున్నామన్నారు. సమావేశంలో డిఎస్పీలు మనోహర్‌రెడ్డి, అందెరాములు, సిఐలు జీవన్‌రెడ్డి, నరేష్‌కుమార్ పాల్గొన్నారు.