అదిలాబాద్

బిసి సబ్‌ప్లాన్‌కు సర్కారు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన బిసి వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, వచ్చే ఏడాది నుండే బిసి సబ్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం బేలా మండలంలోని అవాల్‌పూర్, గూడ, బెదొడ గ్రామాల్లో ఉపాధిహామీ పథకం రూ.13లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన పంచాయతీ భవనాలకు మంత్రి రామన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రామన్న ప్రసంగిస్తూ బంగారు తెలంగాణ లక్ష్య సాధన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నివర్గాల వారికి సమ ప్రాధాన్యత కల్పిస్తున్నారని, తెలంగాణలో వెనకబడినవర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ అమలుచేస్తూ వారి స్వయం ఉపాధికి, పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. సబ్‌ప్లాన్ అమలు ద్వారా ఆర్థిక, సామాజిక అసమానతలను దూరం చేయవచ్చన్నారు. ఫెడరేషన్ ద్వారా పేద వర్గాలకు, నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని, అర్హులైన వారికే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, దళితబస్తీ పథకం కింద భూమి కొనుగోలుచేసి అందజేసిన లబ్దిదారులకు ఈ ఖరీఫ్ నుండే పంట సాగుచేసే విధంగా పూర్తి అధికారాలు కల్పిస్తామన్నారు. బీడు భూములను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో పెన్‌గంగా నదిపై చెనాకకోర్ట బ్యారేజీ నిర్మాణం ద్వారా 59వేల ఎకరాలకు సాగునీరందిస్తామని, వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలోని బీడు భూములన్నీ సాగుజలాలతో సస్యశ్యామలం కానున్నాయని మంత్రి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చి ప్రతి కుటుంబానికి ఆసరా కల్పిస్తామని మంత్రి రామన్న పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీ భవనాల నిర్మాణంతో పాటు పంచాయతీలకు అధికారాలు, విధులు కట్టబెడుతామని, స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే తెలంగాణ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రఘుకుల్‌రెడ్డి, జడ్పీటిసి మనోహర్, టిఆర్‌ఎస్ నాయకులు తేజ్‌రావు తదితరులు పాల్గొన్నారు.