అదిలాబాద్

నిప్పుల కొలిమి ఆదిలాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 26: భానుడు నిప్పులు కక్కుతుండడంతో వేసవితాపంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకుతోడు వడగాలుల ప్రభావంగా పిల్లలు, వృద్దులు, కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. శనివారం ఆదిలాబాద్‌లో 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 27డిగ్రీలుగా ఉంది. మార్చిలోనే ఎండల తాకిడి ఈవిధంగా ఉంటే ఏప్రిల్‌లో పరిస్థితిమరింత భీకరంగా ఉంటుందని జనం బెంబేలెత్తుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూరు, ఆసిఫాబాద్, మంచిర్యాల, సింగరేని కాలనీల్లో భగభగమండుతున్న ఎండలతో జనం నీరసించిపోతున్నారు. జిల్లాలో గత పది రోజుల్లోనే వడదెబ్బకుగురై ఆరుగురు మృతిచెందగా నాలుగు రోజుల క్రితం తలమడుగు మండలం నందిగామ గ్రామంలో ఇద్దరు గిరిజన రైతులు వడదెబ్బకు గురై ఒకే రోజు మృతి చెందిన సంఘటన వేసవి ప్రతాపానికి అద్దంపడుతోంది. పగటి పూట పట్టణ ప్రాంతాలన్ని జనసంచారం లేక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుండగా సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో పగటి వేళల్లో పనిచేసే కార్మికులు ఎండల తాకిడికి దుర్బరజీవితాన్ని వెల్లదీస్తున్నారు. పరీక్షల సమయంలో ఎండ లు ముదురుతుండడంతో విద్యార్థులు ఉక్కపోత భరించలేక.. వడగాలులు తట్టుకోలేక నానఅగచాట్లు పడుతున్నారు. ఇక సంచార జీవితాలను గడిపే సామాన్యుల పరిస్థితి కడుదయనీయంగా మారుతోంది.
ఉపాధి కూలీలకు తప్పని వడదెబ్బ
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నా ఉపాధి కూలీలకు సరైన నీడ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇటీవలే ఇచ్చోడ మండలం సోన్‌పెల్లికి చెందిన ఉపాధి కూలీ నీరసించి వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో కూలీలు ఉపాధి పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. గతేడాది జిల్లా లో వడదెబ్బకు గురై తొమ్మిది మంది ఉపాధి కూలీలు మృతి చెందిన సంఘటన నుండి ఆ శాఖ తేరుకోవడం లేదు. గ్రామస్థాయి సిబ్బంది పని ప్రదేశాల్లో కూలీలకు నీడ సౌకర్యం కోసం షామియానాలు, తాగునీటి వసతి కల్పించాల్సి ఉండగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోజన సమయంలో కూలీలకు నీడ కల్పించాల్సిన అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వేసవిలో చేసిన పనికి అదనపు భత్యం చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి భత్యం ఇవ్వకపోవడం గమనార్హం. మార్చిలో కూలీకి అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉండగా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వడదెబ్బకు గురికాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి
జెసి సుందర్ అబ్నార్
ఎండలు మండుతున్న నేపథ్యంలో వడదెబ్బ మృతులు పెరగకుండా యుద్దప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈమేరకు శనివారం అధిక ఉష్ణోగ్రత వల్ల జరిగే అనర్థాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాధులు సోకకుండా తీసుకోవల్సిన చర్యలపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. పిల్లలు, వృద్దుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని, బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. వడదెబ్బ సోకకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై వైద్యశాఖ విస్తృత ప్రచారం గావించేందుకు కరపత్రాలు, సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. అంతేగాక తాగునీటితో అల్లాడుతున్న మూగజీవాలకు సైతం పశుగ్రాసం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఎండల తీవ్రత నుండి రక్షణకు డిఎంఅండ్‌హెచ్‌వో ఈవిషయంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులు
శ్రీరాంపూర్ రూరల్, మార్చి 26: ఏరియాలోని నస్పూర్ కాలనీ 72వ సర్వే నెంబర్‌లో గల అక్రమ కట్టడాలను శనివారం సింగరేణి ఎస్టేట్ అధికారులు కూల్చివేశారు. ప్రొఫెసర్ జయశంకర్ కాలనీలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తొలగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పబ్బతి స్రవంతి, రాజుమహేందర్ రెడ్డిలకు 10.04.2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఆధ్వర్యంలో తమకు ఇందిరమ్మ పథకం కింద 75గజాల స్థలాన్ని కేటాయించారని పేర్కొన్నారు. అయితే తాను ఆర్థికంగా లేకపోవడంతో ఇంటిని నిర్మించుకోలేకపోయానని, ప్రస్తుతం తాను ఇంటిని నిర్మించుకుంటున్న సమయంలో సింగరేణి అధికారులు వచ్చి తొలగించడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా తమకు పునరావాసం కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.