అదిలాబాద్

కరవు నివారణకు శాశ్వత పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, మార్చి 26: తెలంగాణ రాష్ట్రంలో కరువు నివారణకు ప్రభుత్వం శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతుందని ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలచారి అన్నారు. శనివారం భైంసా పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ 25 వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. మిషన్ కాకతీయ పథకాన్ని దేశ దేశాలు ప్రశంసిస్తున్నాయన్నారు. మిషన్‌కాకతీయ పథకాన్ని ఎందరో ప్రశంసిస్తున్నారని, ఈ పథకం ద్వారా చెరువులు పునరుద్ధరణకు నోచుకుని భూగర్బ జలాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వేసవిలో కరువు నివారణతోపాటు ఉపాధి కూలీలకు 150 పనిదినాలను పెంచినట్లు ఆయన తెలిపారు. గిరిజన నివాస ప్రాంతాల్లో నీటి కొరత తీర్చేందుకు 791 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారని అన్నారు. వీటి ద్వారా ట్యాంకర్ల సహాయంతో నీటి సరఫరాకు ఉపయోగించనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటిల్లో నీటి అవసరాల కోసం 39 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం సమస్యలన్నీ అధిగమిస్తూ బంగారు తెలంగాణే సాదనకై వడివడిగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.