అదిలాబాద్

మీ ఊళ్లకు ఏమీ కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, నవంబర్ 21: తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణంతో కేవలం రైతుల భూములు మాత్రమే కొన్ని ముంపుకు గురవుతాయని ఏ ఒక్క గ్రామానికి కూడా డోకా ఉండదని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి గుండాయిపేట రైతుల గ్రామస్తుల అభ్యర్థన మేరకు వారి సందేహాల నివృత్తి కోసం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు, మహిళలు, యువకులు వారి సందేహాలను, అపోహలను వివిద వర్గాలు వారితో మాట్లాడుతున్న విషయాలను ఎమ్మెల్యే కోనప్ప దృష్టికి తీసుకువచ్చారు. బ్యారేజీ నిర్మాణంతో తమ గ్రామాలు ఖాళీ చేయాల్సిందేనని కొందరు పేర్కొంటున్నారని, సర్వస్వం నమ్ముకున్న భూములు పోవడమే కాక, గూడు, నీడ వదిలిపొమ్మంటే పరిస్థితి ఏంటన్నారు. స్పందించిన ఎమ్మెల్యే కోనప్ప పిచ్చోళ్లు చెప్పే మాటలు నమ్మవద్దని, అవగాహన రాహిత్యం, రాజకీయ లబ్ది , ప్రజలను మోసగించే వ్యక్తులు పనికట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. తాను సిర్పూర్ ఎమ్మెల్యేగా మీ తరుపున ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నానని, గుండాయిపేట గ్రామమే కాక బ్యారేజీ నిర్మాణంతో ఏ ఒక్క గ్రామానికి కూడా ఢోకా లేదని, ఒకవేళ గ్రామాన్ని తరలించే పరిస్థితే వస్తే తన ప్రాణం అడ్డు వేసైనా గ్రామాలను కాపాడుతానని, ఇంతకంటే నేను చెప్పలేనని, మీ నమ్మకాల కోసం మాయమాటలు చెప్పేరకం కాదన్నారు. గుండాయిపేట గ్రామ అభివృద్ది కోసం అహర్నిశలు నిబద్దతతో పాటుపడుతున్నానని, రూ.28కోట్లతో నదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రైతులకు సాగునీరు అందించడం చేశానని, త్వరలోనే గుండాయిపేట గ్రామంలో ముంపు రైతులకు మెరుగైన పరిహారాన్ని అందించడం కోసం గ్రామ సభ సమావేశాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తానని, రైతులు గ్రామస్తులు నిశ్చింతగా తమ పనులు తాము చేసుకోవాలని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కోనప్ప ఈ విధంగా పేర్కొనడం పట్ల కొద్ది రోజులుగా అవస్థలు పడుతూ అయోమయంలో ఉన్న గుండాయిపేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇంటింటికీ తాగునీరు
అభివృద్ధి పనులకు మంత్రి రామన్న శ్రీకారం

ఆదిలాబాద్,నవంబర్ 21: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రతి ఒక్కరికి తాగునీరందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ ద్వారా పైపులైన్ల నిర్మాణం సత్వరమే పూర్తిచేయడమే గాక ప్రతి కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టిన ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్దిపరుస్తానని రాష్ట్ర అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షిద్ నగర్, రీక్షాకాలనీల్లో మురికి కాలువలు, సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి రామన్న శంఖుస్థాపన గావించారు. ఈ సంధర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ పట్టణంలోని 36 వార్డుల అభివృద్దికి ప్రత్యేకంగా రూ.10కోట్ల నిధులు మంజూరయ్యాయని, దశలవారీగా నాణ్యతతో పనులు పూర్తిచేసి కాలనీల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. గ్రామాలతో పాటు పట్టణంలోని ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తూ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టి అభివృద్దికి కృషి చేస్తున్నారని అన్నారు.
తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాబోయే రెండేళ్లలో రూ.4వేల కోట్ల నిధులతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి కుళాయిల ద్వారా శుద్దజలం అందించేందుకు పనులు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు. విద్యుత్ సౌకర్యం లేని కాలనీలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు ఇళ్ల స్థలాలు, పట్టాలు లేని పేద వారిని గుర్తించి అర్హతగలవారందరికి రెండు పడకల ఇళ్ల నిర్మాణంతో పాటు పట్టాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ ఫారూఖ్ ఆహ్మాద్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు నజీర్ ఆస్మ పర్వీన్, వెంకన్న, ఆదిలాబాద్ మున్సిపల్ కమీషనర్ మంగతయారు, ఈ ఈ నాగమల్లేశ్వర్ రావు, సానిటరీ ఇన్స్‌పెక్టర్ ఆయాజ్‌ఖాన్, టీఆర్‌ఎస్ నాయకులు సాజిదోద్దిన్, అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్, జహీర్ రంజాని, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పులి చర్మం స్వాధీనం
* ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అటవీశాఖాదికారులు
* మహారాష్ట్ర పులి చర్మమేనని అనుమానం
బెజ్జూరు, నవంబర్ 21: పొరుగు రాష్టమ్రైన మహారాష్టల్రో వధించిన పెద్దపులి చర్మాన్ని ఇద్దరు వ్యక్తులు తరలిస్తుండగా కొంరం భీం జిల్లా బెజ్జూరు రేంజ్ అటవీ అధికారులు పట్టుకున్నారు. సోమవారం బెజ్జూరు రేంజ్ కార్యాలయంలో కాగజ్‌నగర్ ఎఫ్‌డివో రవి ప్రసాద్, బెజ్జూరు రేంజ్ అధికారి రామ్మోహన్ విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి పట్టుకున్న పులి చర్మం వివరాలను వెల్లడించారు. కుంరంభీం జిల్లాలోని చింతలమానెపెల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన బుర్రి సంతోష్, కేతిని గ్రామానికి చెందిన సేదం సుధాకర్ (దింద సర్పంచ్ భర్త) ప్లాస్టిక్ సంచుల్లో బైక్‌పై సోమవారం పులి చర్మాన్ని అక్రమంగా పెంచికల్‌పేట వైపు తరలిస్తుండగా బెజ్జూరు మండలంలోని ఏటిగూడెం అటవీ ప్రాంతంలో బెజ్జూరు రేంజ్ అటవీ శాఖాధికారులు పులి చర్మాన్ని పట్టుకున్నట్లు ఎఫ్‌డివో రవిప్రసాద్ తెలిపారు. కొన్ని రోజులుగా ప్రాణహిత నది పరిసర ప్రాంతాల నుంచి పట్టణాలకు పులి చర్మాలు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పకడ్బందీ ప్రణాళికతో పులి చర్మాన్ని పట్టుకున్నట్లు వారు తెలిపారు. పులి చర్మం అక్రమంగా విక్రయించేందుకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహారాష్టల్రోని ఆల్లపల్లి అటవీ డివిజన్ నుంచి కొంతమంది పులులను చంపి తెలంగాణ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పులులను వధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే పొరుగు రాష్టమ్రైన మహారాష్ట్ర అటవీ అధికారుల సహాయంతో పులులను వధించే ముఠాను పట్టుకొని గుట్టురట్టు చేస్తామని తెలిపారు. పులి చర్మాల తరలింపు వెనుక ఉన్న ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని, త్వరలో పులులు వదించే ముఠాను ఛేదిస్తామని తెలిపారు. పులి చర్మం అక్రమంగా విక్రయించే ఇద్దరిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు. వధించిన పులి చర్మం విలువ సుమారు రూ. 40లక్షల నుంచి రూ. 50 లక్షలు ఉంటుందని తెలిపారు.

యథేచ్ఛగా పులి చర్మాల అక్రమ రవాణా
బెజ్జూరు, నవంబర్ 21: కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో పులి చర్మాలు అక్రమ రవాణా యథేచ్చగా కొనసాగుతోంది. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం గుండా ప్రాణహిత నది పరిసరాల నుంచి పులి చర్మాలు అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పొరుగు రాష్టమ్రైన మహారాష్టల్రోని ఆల్లపల్లి అటవీ డివిజన్ నుంచి పులులను కొంత మంది దుండగులు వదించి తెలంగాణలోని కుంరంభీం జిల్లా చింతలమానెపెల్లి మండలంలోని గూడెం, దింద పరిసర ప్రాంతాల్లో పులి చర్మాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పులి చర్మాలకు పట్టణాల్లో భలే గిరాకీ ఉండటంతో కొంత మంది ముఠాలుగా ఏర్పరుచుకొని పులుల చర్మాలు విక్రయిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది పరిసరాల గుండా తెలంగాణలోని ముఠాలు పట్టణాలకు పులి చర్మాలు విక్రయిస్తున్నారు. తాజాగా సోమవారం మహారాష్టల్రోని ఆల్లపల్లి నుంచి పులి చర్మాన్ని చింతలమానెపెల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన సంతోష్, దింద సర్పంచ్ భర్త సుదాకర్‌లు ద్విచక్ర వాహనంపై పులి చర్మాన్ని బెజ్జూరు నుంచి పెంచికల్‌పేట వైపు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బెజ్జూరు అటవీశాఖాధికారులు పులి చర్మాన్ని పట్టుకొని బైక్‌ను స్వాదీనం చేసుకున్నారు. 2011 సంవత్సరంలో కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని ఊట్‌పల్లి అటవీ ప్రాంతంలో కొంతమంది దుండగులు పులిని వదించారు. 2006లో బెజ్జూరు రేంజ్ మాణిక్‌దేవార అటవీ ప్రాంతంలో పులిని వదించి పులి గోర్లు, మీసాలను, చర్మాన్ని విక్రయించిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 1980-85 సంవత్సరంలో సిర్పూర్‌టి అటవీ ప్రాంతంలో రెండు పులులు రైలు ఢీకొని చనిపోయాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో 2011 లెక్కల ప్రకారం 5 పులులు ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. పులులు వధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టికి కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో పులులు పెరుగుతున్నట్లు తీసుకెళ్లారు.

అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించాలి
ప్రజావాణిలో కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి

ఆదిలాబాద్,నవంబర్ 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బస్తీ పథకంలో అర్హులైన దళిత కుటుంబాలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, లక్ష్యాలను అదిగమించాలని, ప్రతి సోమవారం వచ్చే ఆర్జీలు మరోసారి రాకుండా అధికారులు పరిష్కారంకోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది ఆర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట గ్రామానికి చెందిన ఏ.రాజేశ్వర్ తన పట్టా భూమిలో ఇతరులు ఇళ్ళ నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని తొలగించాలని కలెక్టర్‌ను కోరారు. అదే విధంగా ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామానికి చెందిన ఎన్.అడెల్లు, ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి చెందిన బి.శ్రీనివాస్, నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కు చెందిన సంజీవ్ కుమార్ గైక్వాడ్‌లు దళిత కార్పొరేషన్ ద్వారా రుణాల కొరకు దరఖాస్తులు చేసుకోగా బ్యాంక్ అధికారులు కానె్సంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన ఏనుగు రాకేష్ రెడ్డి తన తండ్రి గుండెపోటుతో చనిపోగా అప్బందుపథకం ద్వారా డబ్బులు మంజూరి కాలేదని, ఉట్నూరు మండలం చెందూరి గ్రామానికి చెందిన గిరిజన అభ్యర్థిని కుర్సెంగె లక్ష్మిబాయి ఇందిర జలప్రభ పథకం ద్వారా తన వ్యవసాయ భూమికి విద్యుత్ సౌకర్యం లేదని, విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని దరఖాస్తులు సమర్పించారు. బోథ్ మండలం పర్సులపల్లి గ్రామానికి చెందిన గిరిజన అభ్యర్థి జుగ్నాక మారుతి సోనాల గ్రామం నుండి పర్సులపల్లి గ్రామం వరకు రహదారి లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బిటి రోడ్డు నిర్మించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఆర్జీదారులు కలెక్టర్ వారి సమస్యలను విన్నవించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ బుద్ద ప్రకాష్ మాట్లాడుతూ ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాల ద్వారా అందిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని, ఏ ఒక్క దరఖాస్తు పెండింగ్‌లో లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెసి కృష్ణారెడ్డి, ముఖ్య ప్రణాళికాధికారి కేశవ్‌రావు, జిల్లా పరిషత్ సి ఈవో జితేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి రాజేశ్వర్ రాథోడ్, జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఐటిడిఏ ముందు
ఏఎన్‌ఎంల ధర్నా
ఉట్నూరు,నవంబర్ 21: ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐటిడిఏ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ప్రజా సంఘాల నాయకులు జాదవ్ రమణనాయక్, ఆత్రం రవీందర్, రామరావు, రాందాస్ తదితరులు మద్దతు పలికారు. ఈ సంధర్భంగా పలువురు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో ఎలాంటి సెలవులు లేక విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలకు కేవలం రూ.3వేలు చెల్లించడం దారుణమన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటిడి ఏ అధికారులు నాగోరావు, రాంమూర్తిలకు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా డిడి రాంమూర్తి మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో 98 మంది ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారని, వారికి ఎలాంటి పోస్టులు లేవని వారి డిమాండ్ల పరిష్కారం ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ గతంలో స్పందించి రూ.3వేల వేతనం ఉన్న ఏ ఎన్ ఎంలందరికి రూ.5వేల వేతనం ఇవ్వాలని ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అవి మంజూరయ్యాని, నిధులు రాగానే వారికి గత జూన్ నెల నుండి వేతన బకాయిలు చెల్లిస్తామని అన్నారు. దీంతో డిడి రాంమూర్తి హామీతో ధర్నాను విరమించారు.