అదిలాబాద్

పోలీసులకూ ఇంటర్నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 2: ప్రతి పోలీసు కానిస్టేబుల్‌కు సాంకేతిక సమాచార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా త్వరలోనే ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు వన్ జీబి డాటాకార్డుతో కూడిన సిమ్‌కార్డులను కూడా జారీ చేయనున్నట్లు వరంగల్‌జోన్ పోలీసు ఐజి వై.నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఐజికి జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ ఘన స్వాగతం పలికి, ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు వ్యవస్థ పనితీరు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి వివరించారు. ఈ సంధర్భంగా ఐజి సాయుధ పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఆదిలాబాద్‌లోని బస్టాండ్ ప్రాంగణంలో పోలీసు సబ్ కంట్రోల్ రూంను ప్రారంభించారు. అనంతరం ఎస్పీతో కలిసి ఐజి టూ టౌన్ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న బందోబస్తు చర్యలు, దొంగతనాల కేసుల వివరాలు, కానిస్టేబుళ్ల సిబ్బంది సంక్షేమ, సామాజిక అభివృద్ది వ్యవహారాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ ఐజితో మాట్లాడుతూ జిల్లాలో పోలీసు రక్షణ చర్యలపై పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశామని, పట్టణంలో సిసి టివిల ఏర్పాటుతో పాటు దొంగ తనాల నివారణకు అదనంగా రాత్రి వేళల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో పోలీసు పనితీరు అంశాలపై ఐజి సమీక్షించి నేరవ్యవస్థను నిర్మూలించేందుకు మూడంచెల వ్యూహం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఐజి వై.నాగిరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన అనంతరం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, దొంగతనాలు తగ్గుముఖం పట్టాయన్నారు. పోలీసులు సైతం చురుగ్గా పాల్గొంటూ నేరాలకు సంబంధించి ఆస్తులను రికవరీ చేసి నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉందని, చిన్న జిల్లాకావడంతో పోలీసుల సంఖ్య తగ్గిందని, దీంతో పోలీసుల అదనపు భారాన్ని తగ్గించేందుకు త్వరలోనే నూతన పోలీసు కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పోలీసులు సామాజిక సేవతో పాటు ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకున్నారన్నారు. పట్టణాల్లో నేరాలను తగ్గించడమే గాక ట్రాఫిక్ సమస్యపై దృష్టిసారించి, ప్రజల ఇబ్బందులను దూరం చేయాలని ఐజి నాగిరెడ్డి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డిఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్.మల్లారెడ్డి, కె.సీతారాములు, కె.నర్సింహారెడ్డి, ఏఆర్ డిఎస్పీ ఎండి బుర్హాన్ అలీ, సిఐలు ఎం.సత్యనారాయణ, ఎం.వెంకటస్వామి, ఎండి షేర్ అలీ, పోతారం శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, ఆర్‌ఐ బి.జెమ్స్, ఎస్సైలు జి.రాజన్న, ఆర్‌ఎస్సై పెద్దయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.