అదిలాబాద్

అసమానతలు తొలగించేందకే బిసి కమిషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 2: బిసి తెగల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ ముదిరాజ్‌ల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, కొత్తగా ఏర్పాటు చేసిన బిసి కమిషన్ ద్వారా జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు, అసమానతలు తొలగించేందుకు అధ్యయనం చేయనున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. డిసెంబర్ 18న హైదరాబాద్‌లో జరిగే ముదిరాజ్ రాష్ట్ర బహిరంగ సభ నేపత్యంలో శుక్రవారం ఆదిలాబాద్ నుండి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్వర్యంలో మహాపాదయాత్రను మంత్రి జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లోని గాంధీపార్కులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి జోగురామన్న మాట్లాడుతూ బిసి తెగల్లో పలు కులాలు ఇప్పటికీ వివిధ రంగాల్లో అసమానతలు ఎదుర్కొంటున్నాయని, పేదరికం, నిరుద్యోగం, రిజర్వేషన్లపై ప్రత్యేకంగా కమిషన్ ద్వారా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడకముందు బిసి వర్గాలు అనేక రకాలుగా వివక్షకు, నిరాదారణకు గురయ్యారని, వారిలో ఉన్న అసమానతలను తొలగించి అన్ని రంగాల్లో అభివృద్దిపర్చాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. చేపల వృత్తిపై ఆధారపడి ఉన్న ముదిరాజ్‌లను బిసి డి నుండి బిసిఏలోకి చేర్చడం జరిగిందని, రిజర్వేషన్ల అమలుపై కూలంకశంగా చర్చించివారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్నివిధాల కృషిచేస్తుందని మంత్రి రామన్న స్పష్టం చేశారు. యువజన సంఘాలకు చేయూతనిస్తూ ప్రత్యేక ఆర్థిక సమాఖ్య ఏర్పాటు విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని, సహకార సంఘాల్లో స్థానం కల్పించే విషయమై కూడా చర్చిస్తామని మంత్రి అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తూనే వారికి ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి అన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అసమానతలు తొలగించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌లు మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనకబడ్డ ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, మంత్రి జోగురామన్న ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు జరిగే పాదయాత్రకు దారి పొడవున ముదిరాజ్‌లు స్వాగతం పలుకాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో డప్పువాయిద్యాల మద్య ముదిరాజ్‌లు మహాప్రదర్శన నిర్వహించి, పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ నారాయణ, అధ్యయన వేదిక అధ్యక్షుడు శివయ్య, కౌన్సిలర్ సత్యనారాయణ, దర్శనాల దేవేందర్, గోనెల గంగాధర్, శివకుమార్, ప్రవీణ్, లస్మన్న, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థులకు వౌలిక వసతులు కల్పించాలి
* ఐటిడిఏ ఇన్‌చార్జి పివో ఆర్‌వి కర్ణన్
ఉట్నూరు,డిసెంబర్ 2: గిరిజన విద్యార్థులకు గిరిజన సంక్షేమ శాఖ అధ్వర్యంలో అన్ని వౌలిక సౌకర్యాలు కల్పించాలని ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి, వారి పురోగతికి, విద్యార్థుల వికాసానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో వంట చెఱుకు నిషేదించినందునా దాని స్థానంలో వంటగ్యాస్‌ను వినియోగించాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మత్తులు ఎంత వరకు పూర్తయ్యాయో అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల పనులు డిసెంబర్ చివరి వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. శుద్దజల ప్లాంట్‌లు పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని మరమ్మత్తులు చేయించి విద్యార్థులకు తాగునీరు అందించాలని అన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందునా సోలార్ వాటర్ హీటర్లు పెట్టిన ఆశ్రమ పాఠశాలల్లో వాటికి మరమ్మత్తులు చేయించి వేడి నీరు అందే విధంగా చూడాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఆశ్రద్దవహించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి రాంమూర్తి, ఈఈ రమేష్, డిఎంవో అల్హాం రవి తదితరులు పాల్గొన్నారు.