అదిలాబాద్

అమ్మవారి సేవలో విహెచ్‌పి నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మార్చి 27: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఆదివారం సాయంత్రం విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.రామరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అర్చకులు, అధికారులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి చెంత ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహింపచేసి హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆలయ సూపరిండెంట్ గిరిధర్, విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షులు ఎం.రామరాజును ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరి వెంట జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సతీశ్వర్‌రావు, నాయకులు భగవంత్‌రావు, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.